News March 13, 2025
గద్వాల జిల్లాలో దంచికొడుతున్న ఎండలు..!

గద్వాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు దిమ్మతిరిగేలా 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులను ఉపయోగించాలని ప్రభుత్వ అధికారులు ప్రజలకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. బుధవారం మల్దకల్ లో అత్యధికంగా 39.7°c నమోదవ్వగా.. గద్వాల్ లో 38.9°c, ధరూర్‌లో 38.3°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News February 12, 2026
మా ప్రాజెక్టుల్ని AP ఎందుకు అడ్డుకుంటోంది: రేవంత్

TG: ‘పాలమూరు-రంగారెడ్డి’ని AP అడ్డుకోవడంపై CM రేవంత్ అసహనం వ్యక్తంచేశారు. ‘పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసుకోవచ్చని విభజన చట్టంలో ఉన్నా ఎందుకు అడ్డుకుంటున్నారు? మీ ఇష్టమొచ్చినట్లు మీరు చేస్తే మాకు నచ్చినట్లు మేమూ చేస్తాం. గోదావరి జలాల్లో మాకూ 960 TMCల వాటా ఉంది. బేసిన్ అవసరాలు తీరాకే ఇతర బేసిన్లకు నీటిని తరలించాలి. మిగులు జలాల్లో చెరిసగం వాడుకోవచ్చు. చర్చలతో సమస్య తీరుతుంది’ అని CM పేర్కొన్నారు.
News February 12, 2026
MBNR: రేపే కౌంటింగ్.. ఇవి నిషేధం: SP

పాలమూరు యూనివర్సిటీ (లెక్కింపు కేంద్రం) పరిసర ప్రాంతాల్లో BNSS 163 ప్రకారం నిషేధాజ్ఞలు (సెక్షన్ 144 అమలు) శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉ.6 గంటల వరకు అమల్లో ఉంటాయని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. అగ్గిపెట్టెలు, లైటర్లు, ఇంక్ బాటిల్స్, పేలుడు పదార్థాలు లేదా భద్రతకు ముప్పు కలిగించే ఏవైనా వస్తువులు లెక్కింపు కేంద్రంలోకి తీసుకురావడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.
News February 12, 2026
MBNR: నియమాలు ఉల్లంఘిస్తే రిమాండ్‌కే: SP

పాలమూరు యూనివర్సిటీ వద్ద ఓట్ల లెక్కింపుకు నియమించిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ డి.జానకి బందోబస్తుపై పలు సూచనలు చేశారు. గెలిచిన, ఓడిన అభ్యర్థులు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపిస్తామని హెచ్చరించారు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు. SHARE IT.


