News February 27, 2026

గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

image

*గద్వాల: కలెక్టర్ సంతోష్ బదిలీ
*నూతన కలెక్టర్ గా రిజ్వాన్ భాషా షేక్
*పోలీస్ సేవలు మెరుగుపరచాలి
*భక్తుల ఇంటి వద్దకు భద్రాద్రి రాముల వారి తలంబ్రాలు
*కేటీ దొడ్డి: గంగన్ పల్లి లో విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ
*అయిజ: సీటీపాడులో అగ్ని ప్రమాదం- రూ.50 వేలు గ్రాసం దగ్ధం
*మానవపాడు: బస్సు లేక ఆటోలో పరీక్షలకు విద్యార్థినిలు
*రాజోలి: మురుగుతో అవస్థలు రాత్రి దోమల బెడద

Similar News

News April 12, 2026

కొడకండ్ల విద్యార్థినులకు 994 మార్కులు

image

ఇంటర్మీడియట్ ఫలితాల్లో జనగామ జిల్లా కొడకండ్ల గురుకుల విద్యార్థులు మరోసారి ప్రతిభ చాటారు. వరుసగా నాలుగోసారి 100% ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్‌ BIPCలో M.సింధు, B.పావని 1000 మార్కులకు గాను 994 సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకులు పొందినట్లు ప్రిన్సిపల్ తమ్మి దిలీప్ కుమార్ తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఆయన అభినందించారు.

News April 12, 2026

మహిళా రిజర్వేషన్ చట్టం.. ఫ్లోర్ లీడర్లకు మోదీ లేఖ

image

మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు టైమ్ వచ్చిందని PM మోదీ స్పష్టం చేశారు. 2029 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచే కోటా అమల్లోకి వస్తుందని ఫ్లోర్ లీడర్లకు రాసిన లేఖలో వెల్లడించారు. ఈ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించాలని MPలను కోరారు. ఏప్రిల్ 16 నుంచి 3రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు, MPలు హాజరు కావాలని BJP విప్ జారీ చేసింది.

News April 12, 2026

ఇంటర్ సెకండియర్‌లో RRకు 5TH ర్యాంక్

image

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. RR(D)లో రెగ్యులర్ విద్యార్థులు 74723 మంది పరీక్షలు రాయగా 60981 మంది పాసై 81.61 శాతంతో స్టేట్‌లోనే 5th ర్యాంక్ వచ్చింది. రెగ్యులర్ ఒకేషనల్‌లో 3042మందికి 2279 మంది పాసై 74.92%తో 15వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 7,246మందికి 2106 మంది పాసై 29.06%తో 26వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 223 మందికి 115 మంది పాసై 51.57%తో 17వ ప్లేస్ వచ్చింది.