News April 14, 2025
గద్వాల జిల్లాలో బైక్ చోరీ

పార్క్ చేసిన బైక్ చోరీకి గురైన ఘటన నిన్న ఉండవెల్లిలో జరిగింది. పోలీసుల వివరాలు.. కర్నూలులోని ఇందిరాగాంధీనగర్ వాసి భాస్కర్ పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర ఈనెల 8న బైక్ పార్క్ చేశారు. కొంత సమయం అనంతరం వచ్చి చూడగా బైక్ కనిపించకపోవటంతో స్థానికులను వాకబు చేశారు. ఎంతవెతికినా ఫలితం లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News March 13, 2026
VJA: బాలికతో అసభ్య ప్రవర్తన.. ప్రిన్సిపల్‌కు రిమాండ్

విజయవాడ భవానిపురానికి చెందిన ఓ బాలికతో స్కూల్ ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రిన్సిపల్ సాంబశివరావు(65)ను భవానిపురం పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఎదుట గురువారం హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు భవానిపురం సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు.
News March 13, 2026
ఫ్లాష్ ఫ్లడ్స్‌ను 24hrs ముందే అంచనా వేయొచ్చు: పిచాయ్

పట్టణాల్లో ఆకస్మిక వరదలను 24hrs ముందే అంచనా వేసే ‘గ్రౌండ్ సోర్స్’ అనే కొత్త AI మోడల్‌ను రూపొందించినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటించారు. ‘జెమినీ’ సాయంతో ఇది 150+ దేశాల్లో 26లక్షల వరద సంఘటనలను విశ్లేషించిందని తెలిపారు. శాస్త్రవేత్తల పరిశోధనలు, ప్రజల సేఫ్టీ కోసం ఈ డేటాను గూగుల్ <
News March 13, 2026
మధిర: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన శిభా భిషోయ్(29)కు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ సత్తుపల్లి 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్ గురువారం తీర్పు వెల్లడించారు. 2025 జూన్ 8న కొదుమూరు రోడ్ నిర్మాణ పనుల వద్ద సుమంత్ కుమార్ పండేను ఇనుపరాడుతో దాడి చేసి హత్య చేసినట్లు నిరూపితమైంది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులను సీపీ అభినందించారు.


