News March 5, 2025
గద్వాల జిల్లాలో భానుడి భగభగలు

గద్వాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నందున ఫ్యాన్లు, కూలర్లు వాడకం పెరిగింది. దీంతో విద్యుత్ వినియోగం పెరిగిందని విద్యుత్ అధికారులు తెలుపుతున్నారు. మంగళవారం గరిష్ఠంగా అలంపూర్, ద్యాగదొడ్డి, రాజోలి, మల్దకల్లో 38.9°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక గద్వాల్లో 38.6, చిన్న తాండ్రపాడు, సాతర్ల, ధరూర్ లో 38.5°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News December 24, 2025
మాల్యా భారత్కు ఎప్పుడు వస్తారు: బాంబే హైకోర్టు

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి బ్రిటన్కు పారిపోయిన విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. “భారత్కు ఎప్పుడు వస్తారు?” అనేది రాతపూర్వక అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది. విదేశాల్లో ఉంటూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను విచారించబోమని స్పష్టం చేసింది. నేర విచారణ నుంచి తప్పించుకుని.. విదేశాల్లో ఉంటూ చట్టాన్ని సవాలు చేయడం సరికాదని ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.
News December 24, 2025
హైకోర్టుల్లో కేసుల విచారణ ఇలా!

హైకోర్టుల్లో కేసుల విచారణ క్రమ పద్ధతిలో జరుగుతుంది. TG HCలో 32, APలో 23 హాళ్లున్నాయి. హాల్-1లో CJ పిల్, రిట్ పిటిషన్లను విచారిస్తారు. 2-3 జడ్జిలుండే డివిజన్ బెంచ్లు(H2-10) క్రిమినల్ అప్పీళ్లు, హెబియస్ కార్పస్ కేసులను చేపడతాయి. మిగిలిన హాళ్లలో సింగిల్ బెంచ్లు సివిల్, క్రిమినల్, బెయిల్ పిటిషన్ల వాదనలు వింటాయి. ఈ కేసులే విచారించాలనేది ఫిక్స్ కాదు. <
News December 24, 2025
HYD: సిటీ కుర్రాళ్ల కొత్త ట్రెండ్..!

భాగ్యనగరంలో కేఫ్ కల్చర్ సరికొత్త పుంతలు తొక్కుతోంది. కేవలం కాఫీ, కబుర్లకే పరిమితం కాకుండా ‘పికిల్ బాల్’ వంటి క్రీడలతో యువత కేఫ్లల్లో సందడి చేస్తోంది. ఫ్రెంచ్, ఈజిప్షియన్ థీమ్స్తో సరికొత్త లోకాలను తలపిస్తున్న ఈ ప్రాంతాలు జెన్-జీ కుర్రాళ్లకు అడ్డాగా మారాయి. మరోవైపు ‘DIY’ ఫ్యాషన్తో పాత చికంకారీ వస్త్రాలకు స్ట్రీట్ వేర్ టచ్ ఇచ్చి ఫ్లీ మార్కెట్లలో సందడి చేస్తున్నారు.


