News March 10, 2025
గద్వాల జిల్లాలో భానుని భగభగలు

గద్వాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నందున ఫ్యాన్లు, కూలర్లు వాడకం పెరిగింది. రానున్న రోజుల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం మల్దకల్ మండల కేంద్రంలో అత్యధికంగా 40.2°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక అలంపూర్ లో 39.9°c, సాతర్లలో 39.3°c, ధరూర్ లో 38.6°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News March 10, 2025
ALERT.. నోటిఫికేషన్ విడుదల

AP: ECET-2025 నోటిఫికేషన్ను JNTU అనంతపురం విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 7వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా డిప్లొమా చదువుతున్న వారు ఇంజినీరింగ్, ఫార్మసీ సెకండియర్ సహా మరికొన్ని కోర్సుల్లో చేరవచ్చు. మే 6వ తేదీన ఉ.9-12 వరకు, మ.2-5 వరకు పరీక్ష జరుగుతుంది.
News March 10, 2025
NZB: కలెక్టర్ను కలిసిన నూతన సీపీ

నిజామాబాద్ నూతన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన పి.సాయి చైతన్య సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. నూతన సీపీని కలెక్టర్ స్వాగతిస్తూ, అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి మంత్రులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్, సీపీ పాల్గొన్నారు.
News March 10, 2025
నర్సంపేట: అన్ని తామై.. అనాథ యువతుల పెళ్లిళ్లకు ఏర్పాట్లు

నర్సంపేటలోని సంజీవని అనాథాశ్రమంలో చిన్నప్పటి నుంచి ఆశ్రయం పొందిన రోజా, నాగరాణి అనే ఇద్దరు అనాథ యువతులకు ఈనెల 12న వివాహాలు జరగనున్నాయి. ఆ పెళ్లితంతులో భాగంగా సోమవారం అదే ఆశ్రమంలో ఇద్దరు యువతులకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వందలాది మంది మహిళల నడుమ మంగళస్నానాలు చేయించారు. ఏ లోటు లేకుండా పెళ్లిళ్లు జరపాలనే సేవాగుణాన్ని చాటుకోవడం పట్ల ఆశ్రమ నిర్వాహకుడు డా.మోహనరావును ఐసీడీఎస్ సీడీపీవో మధురిమ అభినందించారు.