News March 2, 2025

గద్వాల జిల్లాలో యువకుడి మృతి

image

అలంపూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాలిలా.. కోనేరు గ్రామానికి చెందిన సురేంద్ర బైక్‌పై కర్నూలు నుంచి స్వగ్రామానికి వస్తుండగా.. లింగనవాయి గ్రామ సమీపంలో ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సురేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి లింగన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Similar News

News November 18, 2025

దేవాలయాల సంరక్షణ వేగవంతం: మంత్రి ఆనం

image

నెల్లూరులోని సంతపేట ప్రాంతంలో దేవాదాయశాఖ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల సంరక్షణ, నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. CGF నిధుల వినియోగంపై సమగ్ర సమీక్ష చేపట్టారు. జిల్లాలోని ఆలయాల అభివృద్ధి పనులు, వాటి పురోగతి, భక్తులకు అందిస్తున్న సేవలపై విస్తృతంగా చర్చించారు. ఆలయాల ఆదాయం–ఖర్చుల నిర్వహణలో పారదర్శకత, మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు.

ANU: LLB రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన LLB రీవాల్యుయేషన్ ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. LLB VI, X సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీలోని సంబంధించిన అధికారులను సంప్రదించాలన్నారు.