News March 2, 2025

గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం

image

జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన ఘటన శనివారం శనివారం జరిగింది. పోలీసుల వివరాలిలా.. కర్నూల్ జిల్లా క్రిష్ణగిరి మండలం తాళ్ల గోకులపాడుకు చెందిన నబిసాహెబ్(53) ఆటోలో మరో ఎనిమిది మందితో కలిసి పెబ్బేరు సంతకు బయలుదేరారు. వేముల స్టేజీ సమీపంలో HYDకి వెళ్తున్న ట్యాంకర్‌ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాహెబ్ మృతిచెందగా ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News November 21, 2025

గోదావరిఖని నుంచి కర్ణాటక యాత్ర దర్శన్

image

గోదావరిఖని డిపో భక్తుల కోసం కర్ణాటక యాత్ర దర్శన్ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. DEC 6 మధ్యహ్నం ఒంటిగంటకు గోదావరిఖని నుంచి సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరి 11న తిరిగి ఇక్కడకు చేరుకుంటుంది. ఈ యాత్రలో హంపి, గోకర్ణ, మురుడేశ్వర, ఉడిపి, శృంగేరి, ధర్మస్థలి, కుక్కి సుబ్రమణ్యస్వామి, మంత్రాలయం వంటి పుణ్యక్షేత్రాలు దర్శించుకోవచ్చు. ఒక్కరికి ఛార్జ్ రూ.6,600. వివరాలకు 7013504982 నంబరును సంప్రదించవచ్చు.

News November 21, 2025

డైరెక్షన్‌పై అల్లరి నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

image

డైరెక్షన్ చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉందని నటుడు అల్లరి నరేశ్ అన్నారు. తాను తెరకెక్కించే సినిమా ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’లా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని చెప్పారు. తాను నటించిన తొలి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘12ఏ రైల్వే కాలనీ’ అని, వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిందని తెలిపారు. సమాంతరంగా మూడు నాలుగు కథలు జరుగుతుంటాయని చెప్పారు. ‘12ఏ రైల్వే కాలనీ’ సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజ్ కానుంది.

News November 21, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.