News February 21, 2025
గద్వాల జిల్లాలో వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గద్వాల జిల్లా పరిధిలో గురువారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. కర్నూల్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన తుంగభద్ర ఎక్స్ప్రెస్ మార్గంమధ్యలో గద్వాల జిల్లాలోని మనోపాడ్ రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడికి సంబంధించిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.
Similar News
News March 24, 2025
ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి: బాపట్ల కలెక్టర్

పీజీఆర్ఎస్ నమోదైన ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం కలెక్టరేట్‌లో జరిగింది. ప్రజల నుంచి 170 అర్జీలు వచ్చిన్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలిపి, పరిష్కరించకోవచ్చని తెలపారు.
News March 24, 2025
సాలూరు: ‘పార్లమెంట్‌లో గిరిజన ఉత్పత్తులు’

పార్లమెంట్ లో అరకు కాఫీ స్టాళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కలిశారు. ఈ సందర్భంగా గిరిజన ఉత్పత్తులు, అరకు కాఫీని వారికి మంత్రి అందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, తదితరులు పాల్గొన్నారు.
News March 24, 2025
NLG: మరో మూడు నెలలు పొడిగింపు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును మరో మూడు నెలల పాటు పొడిగించారు. ఈ మేరకు ఐ అండ్ పీఆర్ కమిషనర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 30వ తేదీతో ముగియనున్న అక్రిడేషన్ కార్డుల కాల పరిమితిని జూన్ 30వ తేదీ వరకు పొడిగించారు. అక్రిడేషన్ కార్డుల గడువును పొడిగించడం ఇది నాలుగోసారి. కొత్త అక్రిడిటేషన్ కార్డ్స్ ఇవ్వకుండా పొడిగించుకుంటూ పోవడంపై జర్నలిస్టులు మండిపడుతున్నారు.