News March 26, 2025
గద్వాల జిల్లా ఆదర్శం..!

జోగులాంబ గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో వివిధ రకాల విధులు నిర్వహిస్తారు. పారిశుద్ధ్య చర్యలు, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, వ్యక్తిగత పరిశుభ్రత తదితర పనులతో ప్రజలు ఆర్థికంగా ఆరోగ్యంగా అభివృద్ధి చెందుతున్నారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో ప్రజలు ఆర్థికంగా, ఆత్మగౌరవంతో మరింత బలోపేతమయ్యారు.
Similar News
News November 20, 2025
గ్రామాల్లో నేటి నుంచి చీరలు పంపిణీ

జిల్లాలో ఇందిరా మహిళా శక్తి పేరిట మహిళలు, యువతులకు నేటి నుంచి చీరలను పంపిణీ చేయనున్నారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగా చీరలు పంపిణీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మొదటి విడతగా గ్రామాల్లో గురువారం నుంచి పంపిణీ చేపట్టనున్నారు. జిల్లాలో 3,66,532 మంది సభ్యులు ఉన్నారు. ఈ ప్రక్రియ డిసెంబర్ 9 వరకు కొనసాగనుంది.
News November 20, 2025
ఎమ్మెల్యేల ఫిరాయింపు.. MLA గాంధీ న్యాయవాదుల విచారణ

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారనే పార్టీ ఫిరాయింపు విచారణకు సంబంధించి ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నేడు అసెంబ్లీ కార్యాలయంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల అడ్వకేట్లు తమ వాదనలు వినిపిస్తారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో ఆరుగురి విచారణ ముగిసింది.
News November 20, 2025
HYD: ఆందోళన కలిగిస్తున్న రేబిస్ మరణాలు

నగరవాసులను రేబీస్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి పరిధిలో రేబీస్తో చనిపోయిన వారి సంఖ్య ఈ ఏడాది సెప్టెంబరు వరకు 32కు చేరింది. 2023లో 13, 2024లో 16 మంది మృతి చెందితే ఈఏడాది ఈ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి ఏటా 20వేల మంది కుక్కకాటు బాధితులు వస్తారని సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్ తెలిపారు.


