News April 4, 2025

గద్వాల జిల్లా ఎస్పీ ఆదేశాలు 

image

వేధింపులు, అత్యాచారం, నిరాదరణకు గురైన బాధిత మహిళలకు, బాలలకు భరోసా కేంద్రం ద్వారా అందిస్తున్న న్యాయసలహా, తదితర సేవలు సత్వరమే అందించాలని, వేధింపులు గురైన బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో భరోసా సెంటర్ అనుబంధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు.

Similar News

News October 23, 2025

జగిత్యాల నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్

image

కార్తిక మాసాన్ని పురస్కరించుకుని అరుణాచలం పుణ్యక్షేత్రానికి జగిత్యాల డిపో నుంచి ప్రత్యేక RTC బస్ ఏర్పాటు చేసినట్లు DM కల్పన ఓ ప్రకటనలో తెలిపారు. NOV 3న బస్ బయల్దేరి కాణిపాకం, వేలూరు బంగారులక్ష్మీ అమ్మవారి దర్శనం, పౌర్ణమి రోజు జరిగే అరుణాచల గిరిప్రదక్షిణ అనంతరం జోగులాంబ ఆలయ దర్శనం తరువాత బస్ జగిత్యాలకు చేరుకుంటుంది. ఛార్జీ పెద్దలకు రూ.4,800, పిల్లలకు రూ.3,610లు. వివరాలకు 9014958854కు CALL. SHARE IT

News October 23, 2025

259 ట్రాన్స్‌ఫార్మర్లతో మేడారానికి విద్యుత్ వెలుగులు..!

image

ఈసారి జరిగే మేడారం మహా జాతరలో విద్యుత్ శాఖ భారీ ఏర్పాట్లకు సన్నద్ధమవుతోంది. 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 259 ట్రాన్స్‌ఫార్మర్లు, 9111 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయనున్నారు. వనదేవతల గద్దెల ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగేలా లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. 250km పొడవునా లైటింగ్ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం టీజీ ఎన్పీడీసీఎల్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టనుంది.

News October 23, 2025

MNCL: నవంబర్‌లో బాల వైజ్ఞానిక, ఇన్స్పైర్ ప్రాజెక్టుల ప్రదర్శన

image

మంచిర్యాల జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక, ఇన్స్పైర్ ప్రాజెక్టుల ప్రదర్శన నవంబర్‌లో నిర్వహించనున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. 2024-25లో ఎంపిక చేసిన 108 ఇన్స్పైర్ ప్రదర్శనలను 5వ తేదీలోగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా కాలుష్యం తగ్గించడం అనే అంశంపై విద్యార్థులకు సెమినార్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్‌ను సంప్రదించాలని తెలిపారు.