News March 18, 2025
గద్వాల జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

గద్వాల జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం.సంతోష్ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఉపాధి హామీ పనుల కింద చేపట్టిన సీసీ రోడ్లు తదితర నిర్మాణ పనుల పురోగతిపై మండలాల వారీగా ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు.
Similar News
News March 19, 2025
తాంసి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

తాంసి మండల కేంద్రానికి చెందిన కనాకే ప్రసాద్(42) చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు.. తాంసికి చెందిన ప్రసాద్‌కు హోలీన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రసాద్ చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందాడు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలున్నారు.
News March 19, 2025
NLG: మఖానా సాగుపై కసరత్తు

జిల్లాలో మఖానా సాగు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బిహార్‌లో మాత్రమే రైతులు చేస్తున్న మఖానా సాగుపై జిల్లా అధికారుల బృందం అధ్యయనం చేసింది. ఆ నివేదిక ఆధారంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవతో జిల్లాలోని ఐదు కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా వానాకాలం నుంచి మఖానా సాగు చేయించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల పర్యవేక్షణలో కార్యాచరణ రూపొందించారు.
News March 19, 2025
MBNR: సొంత జిల్లాపై సీఎం కరుణ చూపేనా..?

అసెంబ్లీలో నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఉమ్మడి MBNR జిల్లా ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. రెండు దశాబ్దాలుగా పూర్తికాని నెట్టెంపాడు ప్రాజెక్టు, దానికి గుండెకాయగా ఉన్న ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలు, సంగంబండ ప్రాజెక్టు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల కింద పంప్‌హౌస్‌ల పూర్తి కావాల్సి ఉంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కొడంగల్-పేట ఎత్తిపోతల పథకాల నిధుల కేటాయింపుపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.