News March 19, 2025
గద్వాల జిల్లా ప్రజలకు ఆర్టీసీ శుభవార్త

గద్వాల్ జిల్లా ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ గద్వాల్ డిపో అధికారులు శుభవార్త తెలిపారు. డిపో లాజిస్టిక్స్ సేవల ద్వారా గద్వాల్ జిల్లా ప్రజలు ఇంటికే భద్రాద్రి సీతారాములవారి తలంబ్రాలను పొందవచ్చని కార్గో ఏటీఎం ఇసాక్ తెలిపారు. కార్గో టీమ్‌కు రూ.151 చెల్లించి బుకింగ్ రశీదు పొందాలన్నారు. అనంతరం సీతా రాముల కళ్యాణ తలంబ్రాలను మీ ఇంటి వద్దకు చేర్చుతారని, వివరాలకు పృథ్వీరాజ్ 9154298609 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News November 5, 2025
ఇంటి చిట్కాలు

* కార్పెట్లను శుభ్రం చేయడానికి పావుకప్పు వెనిగర్, చెంచా మొక్కజొన్న పిండి, పావు కప్పు నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ల మీద చల్లి ఐదు నిమిషాలు ఉంచాలి. తర్వాత వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేస్తే సరిపోతుంది.
* చెంచా కాఫీపొడి, గుప్పెడు పుదీనా ఆకులు, చెంచా బేకింగ్ సోడా, కాసిన్ని నిమ్మతొక్కలు, కొద్దిగా నిమ్మరసం ఒక గిన్నెలో వేసి ఒక మూలన ఉంచితే గది అంతా పరిమళం వ్యాపిస్తుంది.
News November 5, 2025
రోడ్డు ప్రమాదం.. నలుగురు TG వాసుల మృతి

కర్ణాటకలోని హల్లిఖేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను, కారు ఢీకొనడంతో నలుగురు తెలంగాణ వాసులు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి(D) జగన్నాథ్‌పూర్ వాసులుగా గుర్తించారు. గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ‘మీర్జాగూడ’ ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
News November 5, 2025
SRD: ఘోర రోడ్డు ప్రమాదం.. నారాయణఖేడ్ వాసులు మృతి

కర్ణాటక రాష్ట్రం హోళికేడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు బుధవారం మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రంలోని గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి క్షేత్రాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


