News April 12, 2025
గద్వాల జిల్లా ప్రజలకు మాత్రమే UPI సేవలు నిలిచాయా?

జోగులాంబ గద్వాల జిల్లాలోని యూపీఐ పేమెంట్స్ అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నెట్వర్క్ స్లో అని వస్తోందని చెబుతున్నారు. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కూడా సాధ్యం కావట్లేదని వేరే జిల్లాలో కూడా ఇలానే అవుతుందా లేదా అంటున్నారు. పదే పదే ఇదే తరహా సమస్య ఎదురవుతోందని చెబుతున్నారు.
Similar News
News December 9, 2025
అన్నవరం ఈవో బదిలీ

అన్నవరం దేవస్థానంలో వరుస ఘటనలపై Way2Newsలో వార్తా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం ప్రభుత్వం ఈవో సుబ్బారావుపై వేటు వేసింది. ఆయనను మాతృ సంస్థ రెవెన్యూ శాఖకు తిరిగి పంపింది. కొత్త ఈవోగా దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ త్రినాధరావును నియమించింది. సుబ్బారావు సర్వీస్ వెనక్కి తీసుకోవడంతో ఆయనపై జరిగిన విచారణ నివేదికపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
News December 9, 2025
ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: నల్గొండ కలెక్టర్

నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను మంగళవారం ఆదేశించారు. కనగల్ ఎంపీడీవో ఆఫీస్, సాయిరాం ఫంక్షన్ హాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్ పేపర్లు, బాక్సులను పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. పోలింగ్ కేంద్రాల వారీగా సామాగ్రి సిద్ధం చేయాలని, బ్యాలెట్ పత్రాలు, బాక్సులు ప్రాపర్‌గా చెక్ చేయాలని సూచించారు.
News December 9, 2025
తూ.గో: డిప్యూటీ సీఎం శాఖలో జీతాల కష్టాలు

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్డబ్ల్యూఎస్ శాఖలో ఉద్యోగులు జీతాలు అందక ఆకలి కేకలు వేస్తున్నారు.
తూ.గో జిల్లా నీటి నాణ్యత పరీక్షా కేంద్రాల సిబ్బందికి ఆగస్టు నుంచి ఐదు నెలల వేతనాలు అందలేదు. క్రిస్మస్, సంక్రాంతి సమీపిస్తున్న వేళ జీతాలు రాకపోవడంతో వేతన జీవుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వెంటనే బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.


