News April 12, 2025
గద్వాల జిల్లా ప్రజలకు మాత్రమే UPI సేవలు నిలిచాయా?

జోగులాంబ గద్వాల జిల్లాలోని యూపీఐ పేమెంట్స్ అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నెట్వర్క్ స్లో అని వస్తోందని చెబుతున్నారు. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కూడా సాధ్యం కావట్లేదని వేరే జిల్లాలో కూడా ఇలానే అవుతుందా లేదా అంటున్నారు. పదే పదే ఇదే తరహా సమస్య ఎదురవుతోందని చెబుతున్నారు.
Similar News
News April 25, 2025
సదాశివనగర్ మండలంలో ప్రపంచ మలేరియా దినోత్సవం

సదాశివనగర్ మండలం ఉత్తనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఆరోగ్య సిబ్బంది ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని ప్రజలకు అవగాహన కల్పించారు. మెడికల్ ఆఫీసర్ సాయికుమార్ మాట్లాడుతూ.. దోమల వల్ల కలిగే వ్యాధులపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. దోమలు పుట్టకుండా, జాగ్రత్తలు తీసుకునేలా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపామన్నారు. సూపర్వైజర్లు ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు.
News April 25, 2025
షీల్డ్ కవర్లో ఛైర్మన్ అభ్యర్థి పేరు..!

కుప్పం మున్సిపల్ ఛైర్మన్ గిరి కోసం అధికార పార్టీలో పోటీ అధికంగా ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఛైర్మన్ అభ్యర్థి పేరును షీల్డ్ కవర్లో పంపిస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఛైర్మన్ గిరి కోసం 20వ వార్డు కౌన్సిలర్ సోము, 19వ వార్డు కౌన్సిలర్ దాముతో పాటు 5వ వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్ పోటీపడుతుండగా సీఎం నిర్ణయమే ఫైనల్ కావడంతో ఆ పదవి ఎవరిని వరిస్తుందో అన్న అంశం సస్పెన్స్‌గా మారింది.
News April 25, 2025
స్కూల్ విద్యార్థులకు ఓయూలో ఇంగ్లిష్ క్లాసస్

8, 9,10 విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల్లో కమ్యూనికేషన్ ఇంగ్లిష్‌పై నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (CELT) ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ ఉంటుంది. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన తరగతులు కూడా ఉంటాయి. రోజూ ఉదయం 8.15 నుంచి 9.45 వరకు శిక్షణ ఉంటుంది. వివరాలకు 7989903001 నంబరుకు ఫోన్ చేయవచ్చు.