News February 15, 2025
గద్వాల జిల్లా వ్యాప్తంగా నేటి ముఖ్య వార్తలు

జోగులాంబ జిల్లా వ్యాప్తంగా నేటి ముఖ్యంశాలు క్రింది విధంగా ఉన్నాయి.@.జిల్లాలో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు.@.ఐజ:కన్నుల పండుగగా తిక్క వీరేశ్వర స్వామి శోభయాత్ర.@.జిల్లాలో పలువురు పోలీస్ అధికారుల బదిలీలు.@. గద్వాల:జమ్ములమ్మకు ప్రత్యేక అలంకరణ.@. అలంపూర్: మార్కింగ్ స్థలాన్ని పరిశీలించిన తహశీల్దార్.@. అలంపూర్:ఇసుక ట్రాక్టర్ పట్టివేత.
Similar News
News October 22, 2025
వర్షాలపట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: SP

జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలను చైతన్యపరస్తూ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి బుధవారం సూచించారు. వర్షం తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు చెరువులు, నదులు, వాగులను పోలీసులు సందర్శించాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని SP హెచ్చరించారు. ఏదైనా అత్యవమైతే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
News October 22, 2025
NLG: ఆ ఊరిలో ఒక్క బెల్టు షాపు లేదు

తిప్పర్తి మండలంలోని కాశివారిగూడెం గ్రామం ఒక్క బెల్టు షాపు కూడా లేని ఆదర్శంగా నిలిచింది. గ్రామ పెద్దలు, యువత, మహిళలు ఏకమై గ్రామంలో మద్యం అమ్మకాలపై పూర్తిగా నిషేధం విధించి, కఠిన చర్యలు చేపట్టారు. దీని ఫలితంగా గ్రామం ప్రశాంతంగా, శుభ్రంగా మారింది. స్వచ్ఛమైన జీవన విధానానికి నిదర్శనంగా నిలుస్తున్న కాశివారిగూడెం గ్రామం, ఇతర గ్రామాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
News October 22, 2025
రాజకీయ లబ్ధికే ప్రభుత్వ ఆస్పత్రులపై దుష్ప్రచారం: రాజనర్సింహ

రాజకీయ లబ్ధి కోసమే కొందరు ప్రభుత్వ ఆస్పత్రులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం తెలిపారు. బస్తీ దవఖానాలో ద్వారా ప్రతిరోజు 45 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. తప్పుడు ప్రచారం చేసే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. డయాగ్నస్టిక్ హబ్ ద్వారా 134 రకాల టెస్టులు ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు.
దుష్పచారం