News February 15, 2025
గద్వాల జిల్లా వ్యాప్తంగా నేటి ముఖ్య వార్తలు

జోగులాంబ జిల్లా వ్యాప్తంగా నేటి ముఖ్యంశాలు క్రింది విధంగా ఉన్నాయి.@.జిల్లాలో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు.@.ఐజ:కన్నుల పండుగగా తిక్క వీరేశ్వర స్వామి శోభయాత్ర.@.జిల్లాలో పలువురు పోలీస్ అధికారుల బదిలీలు.@. గద్వాల:జమ్ములమ్మకు ప్రత్యేక అలంకరణ.@. అలంపూర్: మార్కింగ్ స్థలాన్ని పరిశీలించిన తహశీల్దార్.@. అలంపూర్:ఇసుక ట్రాక్టర్ పట్టివేత.
Similar News
News March 24, 2025
విశాఖ రైతు బజార్లలో కూరగాయల ధరలు

విశాఖ 13 రైతు బజార్లలో వ్యవసాయ, వాణిజ్య శాఖ అధికారులు సోమవారం నాటి కూరగాయల ధరలను విడుదల చేశారు.(రూ/ కేజీలలో) టమోటా రూ.15, ఉల్లిపాయలు రూ.23, బంగాళదుంప రూ.15, కాలీఫ్లవర్ రూ.24, దొండకాయలు రూ.28, దోసకాయలు రూ.18/ 26, క్యాప్సికం రూ.40, క్యారెట్ రూ.28 /38 , వెల్లుల్లి రూ.75/90/110, నల్లమిర్చి రూ.28, వంకాయలు రూ.30, బీరకాయలు రూ. 44 , కర్ర పెండ్లం రూ.20, మునగ రూ.32, అనప రూ.14గా నిర్ణయించారు.
News March 24, 2025
మద్దిరాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలో జరిగింది. స్థానికుల, పోలీసుల వివరాలు.. AP కృష్ణజిల్లా నూజివీడు తాలుకాకి చెందిన యాకుబ్(23) MHBD జిల్లాలో ఉంటున్నాడు. ఆదివారం కూలీల కోసం కుంటపల్లికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో మూలమలుపు వద్ద అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో స్పాట్‌లోనే యాకుబ్ మృతిచెందాడు. కేసు నమోదైంది.
News March 24, 2025
భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఫాల్గుణ మాసం సోమవారం అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషంగా అలంకరణ చేసి వచ్చిన భక్తులకు విశేష పూజలు, హారతి ఇచ్చి, భక్తులకు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. భద్రకాళి దేవస్థానం అర్చకులు, సిబంది, భక్తులు ఉన్నారు.