News March 19, 2025
గద్వాల: జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం సమీక్ష

ప్రఖ్యాత జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం సమీక్ష నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్లోని ప్రజా భవన్లో జరిగిన ఈ భేటీలో జోగులాంబ ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన ప్రణాళికపై చిన్నారెడ్డి, అజయ్ కల్లం చర్చించారు.
Similar News
News November 17, 2025
ఢిల్లీ పేలుడు: ఏమిటీ డెడ్ డ్రాప్?

ఢిల్లీ పేలుడు కేసు నిందితులు ‘డెడ్ డ్రాప్’ ఈ-మెయిల్ విధానం వాడినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఒకే మెయిల్ IDతో రహస్యంగా సమాచార మార్పిడి చేసుకోవడమే ‘డెడ్-డ్రాప్’ పద్ధతి. సమాచారాన్ని డ్రాఫ్ట్లో సేవ్ చేస్తే, దాన్ని అవతలి వ్యక్తి చూస్తారు. తర్వాత అప్డేట్ లేదా డిలీట్ చేస్తారు. ఇందులో మెయిల్ పంపడం, రిసీవ్ చేసుకోవడమనేదే ఉండదు. దీన్ని గుర్తించడం చాలా కష్టమని అధికారులు అంటున్నారు.
News November 17, 2025
తెలంగాణ న్యూస్ అప్డేట్స్

*CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం.
*కాంగ్రెస్, ప్రభుత్వంలో నేతల పనితీరు ఆధారంగా ప్రక్షాళన చేయాలని AICC కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. కొన్ని కలుపు, గంజాయి మొక్కలు ఉన్నాయని, వాటిని ఏరిపారేయాలని చెప్పారు.
* యాదగిరి గుట్టకు లక్షమందికి పైగా భక్తుల రాక. ఒక్క రోజే రూ.కోటికి పైగా ఆదాయం వచ్చినట్లు అధికారుల వెల్లడి.
News November 17, 2025
నల్గొండ ఎస్పీ పేరుతో ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్

నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. దీంతో ఈ నకిలీ ఐడీ నుంచి వచ్చే ఎలాంటి మెసేజ్లకు, రిక్వెస్ట్లకు స్పందించవద్దని ప్రజలకు ఎస్పీ సూచించారు. ఆకతాయిలు ఇలాంటి ఫేక్ ఐడీలు సృష్టించి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.


