News February 7, 2025
గద్వాల: ట్రాన్స్ జెండర్తో ప్రేమ.. యువకుడి సూసైడ్..?
పురుగు మందు తాగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చింతలపేటకు చెందిన నవీన్ అదే కాలనీకి చెందిన ట్రాన్స్ జెండర్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం తన తండ్రి సమాధి వద్ద పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి ప్రైవేట్ పార్ట్స్ వద్ద గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 7, 2025
యాదాద్రి: యువతకు ఉచిత శిక్షణ..
భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురం గ్రామంలో స్వామి రామానంద గ్రామీణ తీర్థ సంస్థలో నిరుద్యోగ యువతి, యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ లక్ష్మీ తెలిపారు. ఎలక్ట్రిషన్, సోలార్ సిస్టం ఇన్స్టలేషన్ & సర్వీస్, కంప్యూటర్ హార్డ్వేర్, సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, సీసీటీవీ టెక్నీషియన్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోసి తదితరాలపై ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News February 7, 2025
నీట్- UG పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
నీట్- యూజీ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మార్చి 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. మే 4న పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకి NTA ఈ పరీక్ష నిర్వహించనుంది.
News February 7, 2025
KMR: BC డిక్లరేషన్ను తుంగలో తొక్కారు: జీవన్ రెడ్డి
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను తుంగలో తొక్కిన కాంగ్రెస్ను స్థానిక ఎన్నికల్లో నిలదీయాలని ఆర్మూర్ BRS మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. NZB పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు కామాను చెరిపేసి ఫుల్ స్టాఫ్ ఎందుకు పెట్టారో బీసీ కాంగ్రెస్ నేతలపై ప్రజలు తిరగబడాలని పిలుపు నిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల పోరులో కాంగ్రెస్ జీరో కావడం ఖాయమన్నారు.