News March 11, 2025

గద్వాల: తల్లిదండ్రులు చనిపోయారు.. అనాథలుగా పిల్లలు

image

గద్వాల జిల్లా మల్దకల్ మండలం చర్లగార్లపాడు గ్రామంలో కొద్దిరోజుల క్రితం భారతి గుండెనొప్పితో మృతిచెందగా ఆర్థిక పరిస్థితులను తట్టుకోలేక భర్త పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. గ్రామానికి చెందిన గడ్డమీది రాముడు తనవంతు సహాయంగా రూ.10,000 ఆర్థిక సహాయం మంగళవారం అందజేశారు. పేదింటికి చెందిన ఆ పిల్లలను దాతలు ఆదుకోవాలని ఆయన కోరాడు.

Similar News

News December 1, 2025

ఈ కాల్స్/మెసేజ్‌లను నమ్మకండి: పోలీసులు

image

పార్సిల్‌లో డ్రగ్స్ అని ఫేక్ లింక్స్‌ పంపుతూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ పోలీసులు X వేదికగా ప్రజలను అప్రమత్తం చేశారు. ‘ఎలాంటి వస్తువునూ బుక్ చేయకుండానే పార్సిల్ గురించి కాల్స్, మెసేజ్‌లు వస్తే నమ్మకండి. ఇలాంటి కాల్స్‌తో భయపెట్టి ఖాతా ఖాళీ చేస్తారు. పార్సిల్‌లో డ్రగ్స్, నిషేధిత వస్తువులు ఉన్నాయని భయపెడతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వీటికి స్పందించకండి’ అని సూచించారు.

News December 1, 2025

వేములవాడ(R) మండలంలో 34 వార్డులు ఏకగ్రీవం

image

వేములవాడ రూరల్ మండలంలో 34 వార్డుల సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. మండలంలోని మొత్తం 17 గ్రామపంచాయతీలకు సంబంధించి 146 వార్డులలో 34 వార్డుల్లో సింగిల్ నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. దీంతో జయవరంలో 7, అచ్చన్నపల్లి 5, బొల్లారం 3, చెక్కపల్లి 2, ఫాజుల్ నగర్ 4, మల్లారం 1, నాగయ్యపల్లి 1, నమిలిగుండుపల్లి 1, తుర్కాశినగర్ 5, వెంకటంపల్లిలో 5 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.

News December 1, 2025

HYD: విమానంలో మహిళా సిబ్బందికి లైంగిక వేధింపులు

image

దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మహిళా క్యాబిన్ సిబ్బందిని ఓ ప్రయాణికుడు లైంగికంగా వేధించాడు. విమానం హైదరాబాద్ చేరుకోగానే RGIA పోలీసులు కేరళకు చెందిన ఆ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు, లైంగిక వేధింపులు, దాడికి సంబంధించిన BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.