News March 11, 2025

గద్వాల: తల్లిదండ్రులు చనిపోయారు.. అనాథలుగా పిల్లలు

image

గద్వాల జిల్లా మల్దకల్ మండలం చర్లగార్లపాడు గ్రామంలో కొద్దిరోజుల క్రితం భారతి గుండెనొప్పితో మృతిచెందగా ఆర్థిక పరిస్థితులను తట్టుకోలేక భర్త పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. గ్రామానికి చెందిన గడ్డమీది రాముడు తనవంతు సహాయంగా రూ.10,000 ఆర్థిక సహాయం మంగళవారం అందజేశారు. పేదింటికి చెందిన ఆ పిల్లలను దాతలు ఆదుకోవాలని ఆయన కోరాడు.

Similar News

News March 7, 2026

నాలుగుసార్లు ప్రధాని.. చిత్తుగా ఓడిపోయారు

image

నేపాల్ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఆ దేశానికి నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీ(CPN-UML) సొంత నియోజకవర్గం జాఫా-5లో చిత్తుగా ఓడిపోయారు. ఆయనపై RSP అభ్యర్థి బాలేంద్ర షా 49,164 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక ఓవరాల్‌గా 165 స్థానాలకుగాను RSP 67 చోట్ల గెలిచింది. 55 సెగ్మెంట్లలో లీడింగ్‌లో ఉంది. మిగతా పార్టీలన్నీ సింగిల్ డిజిట్‌తో పోటీ పడుతున్నాయి.

News March 7, 2026

నిర్మల్: భరోసా కల్పించి.. 133 జంటలను కలిపారు

image

నిర్మల్ జిల్లాలోని భరోసా కేంద్రం ద్వారా కుటుంబ సమస్యలు, చిన్న చిన్న మనస్పర్థలు, క్షణికావేశంతో దూరంగా ఉన్న133 జంటలను జిల్లా పోలీసులు ఒక్కటి చేశారు. భరోసా కేంద్రంలో భార్యాభర్తలకు నిశ్నాతుల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మహిళా ఎస్ఐ పర్యవేక్షణలో సమస్యలను ఓపిగ్గా విని కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబాలను మళ్లీ కలిపేలా పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు.

News March 7, 2026

జనగామ: 99 రోజుల కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష

image

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో నిర్వహించే 99 రోజుల కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు రూపొందించిన యాక్షన్ ప్లాన్‌ను పరిశీలిస్తూ, కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.