News March 24, 2025

గద్వాల: ‘నీళ్లు ఇచ్చే దాకా కదలం’ 

image

అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్‌డీఎస్ రైతులు సాగు నీళ్ల కోసం కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. సుమారు పన్నెండు గ్రామాల రైతులు మాట్లాడుతూ.. సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సాగు నీరు అందించాలని కోరారు. నీళ్లు ఇచ్చేదాకా కదలమని భీష్మించుకుని కూర్చున్నారు. 

Similar News

News December 3, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓కొత్తగూడెంలో మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభించిన సీఎం
✓సమస్యలపై సీఎంకు విజ్ఞప్తి చేసిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య
✓గుండెపోటుతో ఇల్లందులో సింగరేణి కార్మికుడి మృతి
✓పాల్వంచ: నాగారం స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం
✓కొత్తగూడెంలో సీఎం పర్యటన.. ప్రతిపక్ష నాయకుల అరెస్ట్
✓సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు: అశ్వారావుపేట ఎస్సై

News December 3, 2025

బాబయ్య స్వామికి చాదర్ సమర్పించిన మంత్రి, కలెక్టర్

image

పెనుకొండలో బాబయ్య ఉరుసు మహోత్సవం మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, కలెక్టర్ శ్యాం ప్రసాద్ పాల్గొన్నారు. బాబాఫక్రుద్దీన్ గంధం మహోత్సవం సందర్భంగా మంత్రి, కలెక్టర్ బాబయ్య స్వామికి ప్రభుత్వం తరుఫున చాదర్ సమర్పించారు. మంత్రికి బాబయ్యస్వామి దర్గా వంశ పారంపర్య ముతవల్లి తాజ్ బాబా పూలమాల వేసి స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో ప్రార్థనలు చేశారు.

News December 3, 2025

జగిత్యాల: డీసీసీ నియామక పత్రాన్ని అందుకున్న నందయ్య

image

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన నందయ్యకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం నియామక పత్రాన్ని అందజేశారు. హైద్రాబాద్ గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో నియామక పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా పాటుపడాలని సూచించారు.