News January 26, 2025

గద్వాల: నేడు నాలుగు పథకాలకు శ్రీకారం

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 4 పథకాలను జోగులాంబ గద్వాల జిల్లాలోని గ్రామాల్లో ప్రారంభించనున్నారు. ధరూర్-అల్లాపాడు, కేటిదొడ్డి-ఉమీత్యాల, గట్టు-ఆరగిద్ద, గద్వాల- నల్ల దేవుని పల్లి, అల్లంపూర్-గొందిమల్ల, మానవపాడు-చంద్రశేఖర్ నగర్, రాజోలి-తూర్పు గార్లపాడు, బస్వాపుర-బస్వాపురం, వడ్డేపల్లి- కోయిల్దిన్నె, మల్దకల్-సుగురుదొడ్డి, ఐజ-పట్టకనూగోపాల్దిన్నె- గోపాల్దిన్నె, ఎర్రవల్లి- బట్లదిన్నే. 

Similar News

News February 11, 2025

నారాయణపేట మార్కెట్లో పెరిగిన వేరుశనగ ధరలు

image

నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ ధరలు కాస్త పెరిగాయి. మంగళవారం 520.80 క్వింటాళ్ల వేరుశనగ రాగ, క్వింటాలుకు గరిష్టంగా రూ. 6,269, కనిష్టంగా రూ. 3,869 ధర పలికింది. అదేవిధంగా 54.39 క్వింటాళ్ల తెల్ల కందులు రాగ, క్వింటాలుకు గరిష్టంగా రూ. 8,000, కనిష్టంగా రూ. 6,212, 122.50 క్వింటాళ్ల ఎర్ర కందులు రాగ, గరిష్టంగా క్వింటాలుకు రూ. 7,750, కనిష్టంగా రూ. 6,222 ధర పలికిందని అన్నారు.

News February 11, 2025

నగరి ఎమ్మెల్యే సోదరుడు వైసీపీలో చేరికకు బ్రేక్!

image

టీడీపీ నేత, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ సోదరుడు గాలి జగదీశ్ వైసీపీలో చేరికకు తాత్కాలిక బ్రేక్ పడింది. రేపు వైసీపీలో చేరేందుకు మాజీ సీఎం జగన్‌తో వైసీపీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. గాలి జగదీశ్ చేరికకు మాజీ మంత్రి రోజా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆయన చేరికను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో జగదీశ్ నగరి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

News February 11, 2025

రంగరాజన్‌పై దాడిని ఖండించిన చంద్రబాబు

image

AP: చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. నాగరిక సమాజంలో హింసకు తావులేదని హితవు పలికారు. గౌరవప్రదమైన చర్చలు, భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాలి కానీ హింసకు కాదని వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల రంగరాజన్‌పై దాడిని టీజీ సీఎం రేవంత్, కేటీఆర్, పవన్ కళ్యాణ్ తదితర రాజకీయ ప్రముఖులు ఖండించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!