News April 6, 2025
గద్వాల: ‘నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి’

చేనేత ఐక్యవేదిక సభ్యులు నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని గద్వాల మాజీ జడ్పీ ఛైర్పర్సన్ సరిత పేర్కొన్నారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో చేనేత ఐక్యవేదిక రూపొందించిన తెలుగు సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. జిల్లాలో చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తన వంతు సహకరిస్తానని చెప్పారు. మేడం రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 24, 2026
నేటి నుంచి జగన్ పులివెందుల పర్యటన

AP: YSRCP అధినేత YS జగన్ నేటి నుంచి 2రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈరోజు అక్కడికి చేరుకుని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించే ప్రజాదర్బార్‌లో పాల్గొంటారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. రేపు ఉదయం వేంపల్లి మండలం నందిపల్లిలోని నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి హాజరవుతారు. మధ్యాహ్నం తిరిగి పులివెందుల క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌కు హాజరై స్థానిక నేతలతో భేటీ అవుతారు.
News February 24, 2026
VJA: బాలికను మోసం చేసిన యువకుడి రిమాండ్

మైనర్ బాలికను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరుకి చెందిన హేమంత్ సాయి కొత్తపేటకు చెందిన ఓ బాలిక(16)ను మాయ మాటలు చెప్పి మోసం చేశాడు. ఈ మేరకు ఈ నెల 19న కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు సీఐ కొండలరావు తెలిపారు.
News February 24, 2026
విజయవాడ: మహిళతో గొడవ.. యువకుడి సూసైడ్

కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మాచవరంలో సుమంత్ స్వీట్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఓ మహిళతో పరిచయం ఏర్పడగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఇరువురికి ఇటీవల గొడవలు జరుగడంతో మనస్తాపం చెందిన సుమంత్ సోమవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


