News February 1, 2025
గద్వాల: పాఠశాల ఘటనలో ఉపాధ్యాయురాలు సస్పెండ్

గద్వాల జిల్లా అయిజ మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యార్థినిని వాతలు పడేలా కొట్టిన ఉపాధ్యాయురాలిని పాఠశాల విధుల నుంచి తొలగించామని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. అదే విధంగా విద్యార్థికి అయ్యే వైద్య ఖర్చుల మొత్తాన్ని పాఠశాల యాజమాన్యం భరిస్తుందని అన్నారు.
Similar News
News February 18, 2025
జగిత్యాల: ‘సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం సర్వమానవాళికి ఆదర్శం’

బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం సర్వ మానవాళికి ఆదర్శమైనదని అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత అన్నారు. జగిత్యాల బంజారా భవన్‌లో మంగళవారం జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. సంతు సేవాలాల్ బంజారా జాతికే కాదు యావత్ ఇతర కులాలకు ఆదర్శ పురుషుడని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, డీఈవో రాము తదితరులు పాల్గొన్నారు.
News February 18, 2025
రేపటి నుంచే మెగా టోర్నీ.. గెలిచేదెవరో?

రేపటి నుంచి మార్చి 9 వరకు మెగా క్రికెట్ సమరం ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. మరి ఈ టోర్నీలో విన్నర్స్, రన్నర్స్, అత్యధిక పరుగులు, వికెట్లు, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎవరు నిలుస్తారని భావిస్తున్నారో కామెంట్ చేయండి. గత టోర్నీలో పాకిస్థాన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
News February 18, 2025
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. నిందితులకు ముగిసిన విచారణ

AP: తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో నలుగురు నిందితులకు కోర్టు విధించిన 5 రోజుల కస్టడీ ముగిసింది. సిట్ తాత్కాలిక కార్యాలయంలో వారి విచారణ జరగ్గా, ఇవాళ రుయా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం తిరుపతి 2వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చారు. నిందితులు విచారణకు సహకరించట్లేదని, మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని సిట్ అధికారులు కోరినట్లు సమాచారం.