News February 8, 2025

గద్వాల: ‘పెండింగ్‌ ధరణీ దరఖాస్తులను పూర్తి చేయాలి’

image

పెండింగ్‌లో ఉన్న ధరణీ దరఖాస్తులను పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ నారాయణ తహశీల్దార్లకు ఆదేశించారు. శనివారం గద్వాల కలెక్టర్ కలెక్టరేట్లోని హాల్‌లో మండలాల తహశీల్దార్లతో ధరణి, మీ సేవ కేంద్రాలలో దరఖాస్తులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాల వివరాలు, బర్త్, డెత్ సర్టిఫికెట్లు నిర్దేశించిన కాలంలో చేయాలని సూచించారు.

Similar News

News February 15, 2026

ఐదు మున్సిపాలిటీలకు కాంగ్రెస్ విప్‌ల నియామకం

image

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విప్‌లను నియమించినట్లు డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు.. ఏదులాపురానికి దయాకర్ రెడ్డి, మధిరకు ధనికుమార్, వైరాకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కల్లూరుకు ప్రసాద్ రెడ్డి, సత్తుపల్లికి ఎమ్మెల్యే రాగమయిలను విప్‌లుగా ఖరారు చేశారు.

News February 15, 2026

వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

వేములవాడ పురపాలక సంఘం కార్యాలయ భవనంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌కు సంబంధించిన ఎన్నిక ప్రక్రియ ఏర్పాట్లను ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఆర్డీవో రాదాబాయి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్‌తో కలిసి సమావేశ మందిరంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.

News February 15, 2026

పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్

image

T20WC: ICC ఈవెంట్లలో పాక్‌పై భారత్ జైత్రయాత్రను కొనసాగించింది. ఫార్మాట్ ఏదైనా, ప్లేస్ మారినా ఫలితం మారదని నిరూపించింది. కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో దాయాదిని 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్‌ను 18 ఓవర్లలో 114 రన్స్‌కే కట్టడి చేసింది. బుమ్రా, అక్షర్, వరుణ్, హార్దిక్ తలో 2 వికెట్లు, కుల్దీప్, తిలక్ చెరో వికెట్ తీశారు. వరుసగా 3 విజయాలతో IND సూపర్-8కి చేరుకుంది.