News March 25, 2025
గద్వాల: పెళ్లి ఇష్టం లేక యువకుడి SUICIDE

పెళ్లి ఇష్టం లేక యువకుడు ఆత్మహత్యయత్నం చేయగా.. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందిన ఘటన ఎర్రవల్లి మండలంలో జరిగింది. ఎస్ఐ వెంకటేశ్ వివరాలు.. కొండపేటకు చెందిన నరహరికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం ఇష్టంలేక ఆదివారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News December 8, 2025
విమానాల రద్దు.. ఇండిగో షేర్లు భారీగా పతనం

ఇండిగో(ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్) షేర్లు ఇవాళ ట్రేడింగ్లో భారీగా పతనమయ్యాయి. సెషన్ ప్రారంభంలో ఏకంగా 7 శాతం నష్టపోయాయి. తర్వాత కాస్త ఎగసినా మళ్లీ డౌన్ అయ్యాయి. ప్రస్తుతం 406 పాయింట్లు కోల్పోయి(7.6 శాతం) 4,964 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గత 5 రోజుల్లో ఏకంగా 14 శాతం మేర నష్టపోయాయి. వారం రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేస్తున్నారు.
News December 8, 2025
వెంకటాపూర్: సర్పంచ్ పోరు.. ఇదే ప్రత్యేకత..!

మరికల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల నుంచి విజయ్ కుమార్ రెడ్డి, రాజేందర్ రెడ్డిలు పోటీ చేస్తున్నారు. ఈ పంచాయతీ జనరల్కు కేటాయించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయకుమార్ తల్లి కళావతమ్మ, బీఆర్ఎస్ నుంచి రాజేందర్ రెడ్డి తల్లి అనితలు పోటీ చేశారు. గత ఎన్నికల్లో కళావతమ్మ విజయం సాధించారు. మరి ఈ ఎన్నికల్లో ఎవ్వరిని విజయం వస్తుందో ఈనెల 14న తెలుస్తుంది.
News December 8, 2025
నిర్మల్: వాతావరణ శాఖ హెచ్చరిక

జిల్లాలో రాబోయే రోజుల్లో చలిగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం హెచ్చరించింది. ముఖ్యంగా డిసెంబర్ 10 నుంచి 13వ తేదీల మధ్య ఉదయం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని తెలిపారు. జిల్లా వాసులు సాయంత్రం తర్వాత తప్పనిసరిగా వెచ్చని దుస్తులు ధరించాలని, చిన్నపిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.


