News March 11, 2025
గద్వాల: ప్రజావాణికి 38 ఫిర్యాదు: కలెక్టర్

గద్వాల జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 38 ఫిర్యాదులు వచ్చాయని గద్వాల కలెక్టర్ సంతోష్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 20, 2025
బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి గడువు విధించలేం: సుప్రీంకోర్టు

బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకి తాము గడువు నిర్దేశించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గడువు విధించడం రాజ్యాంగ అధికారాలను తుంగలో తొక్కడమేనని పేర్కొంది. అయితే సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టడం సరికాదని అభిప్రాయపడింది. అయితే గవర్నర్లు మాత్రం బిల్లులను ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం లేదా తిరిగి అసెంబ్లీకి పంపడం మాత్రమే చేయాలంది. వారికి నాలుగో అధికారం లేదని స్పష్టం చేసింది.
News November 20, 2025
ఆటో ఇమ్యూన్ వ్యాధుల ముప్పు అమ్మాయిలకే ఎక్కువ

మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడూ వైరస్‌లూ, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతూ ఉంటుంది. బయటి వ్యాధి కారకాలు ఏవైనా మనలోకి ప్రవేశించిన వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ అప్రమత్తమై, వాటితో పోరాడటానికి తన రక్షణ కణాలను పంపుతుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక కణాలు ఒంట్లోని సొంత కణాలతోనే పోరాడతాయి. వాటినే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. ఇవి మహిళల్లో 20-40 ఏళ్ల వయసులో ఎక్కువగా వస్తుంటాయి.
News November 20, 2025
HNK: TASK ఆధ్వర్యంలో టెక్నికల్ కోర్సులకు శిక్షణ

చైతన్య యూనివర్సిటీలోని TASK ఆఫీసులో టెక్నికల్ కోర్సులకు శిక్షణ ఇవ్వనున్నట్లు TASK ప్రతినిధులు తెలిపారు. Java, Python, వెబ్ డెవలప్మెంట్, డేటా బేస్, Sudo కోడ్, C, C++, HTML, CSS, Java Scriptపై కోచింగ్ ఇస్తారని, డిగ్రీ, B.TECH, PG పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 24 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. బ్యాంకింగ్, పోటీ పరీక్షల నిమిత్తం ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ స్టడీస్ కోచింగ్ ఇవ్వనున్నారు.


