News March 11, 2025

గద్వాల: ప్రజావాణికి 38 ఫిర్యాదు: కలెక్టర్

image

గద్వాల జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 38 ఫిర్యాదులు వచ్చాయని గద్వాల కలెక్టర్ సంతోష్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News March 25, 2025

ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సంపూర్ణ సహకారం అందించాలి: కలెక్టర్

image

రబీ ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో రబీ ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు, పౌరసరఫరాలు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లర్ల సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు సానుకూలతతో ఉంటుందని తెలిపారు.

News March 25, 2025

టేకుమట్ల: ఘోర రోడ్డు ప్రమాదం (UPDATE)

image

టేకుమట్ల మండలంలోని రామకృష్ణాపూర్(టి) సమీపంలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదంలో వరి పొలంలో పనికి సిద్ధమవుతున్న కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ క్రమంలో మోకిడి సంధ్య (30), పూలమ్మ (51) అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబంలో ప్రేమానురాగాలు పంచే తల్లులు మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి పిల్లల రోదనలు మిన్నంటాయి. 

News March 25, 2025

BIG NEWS: ఏప్రిల్ 1 నుంచి ‘సదరమ్’ స్లాట్లు

image

AP: దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సామాజిక పింఛన్ల తనిఖీ కోసం కొంతకాలంగా నిలిపివేసిన సదరమ్ స్లాట్లను ఏప్రిల్ 1 నుంచి పున:ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన ఏరియా, జిల్లా, టీచింగ్ ఆస్పత్రులు/GGHలలో ప్రతి మంగళవారం స్లాట్‌లు అందుబాటులో ఉంటాయని సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఎ.సిరి తెలిపారు. పరీక్షల అనంతరం అర్హులకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని పేర్కొన్నారు.

error: Content is protected !!