News April 8, 2025

గద్వాల: ప్రతి గింజను కొనుగోలు చేయాలి: అదనపు కలెక్టర్

image

2024-25 యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం గద్వాల జిల్లా కలెక్టరేట్‌లో రబీ యాక్షన్ ప్లాన్‌పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేస్తామన్నారు.

Similar News

News November 6, 2025

లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించాలి: ఎస్పీ శ్రీనివాసరావు

image

రాజీ పడదగ్గ కేసులు లోక్ అదాలత్‌లో పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు సంబంధిత పోలీస్ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. కేసుల పరిష్కారానికై ఈనెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అడిషనల్ SP శంకర్ పాల్గొన్నారు.

News November 6, 2025

మేడారం జాతరలో 30 వైద్య శిబిరాలు: డీఎంహెచ్వో

image

జనవరిలో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరలో 30 ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ములుగు డీఎంహెచ్వో డాక్టర్ గోపాలరావు తెలిపారు. ఉప వైద్యాధికారి, ప్రోగ్రాం ఆఫీసర్లతో కలిసి మేడారంలో పర్యటించారు. శిబిరాల ఏర్పాటుకు అనుకూలమైన స్థలాలను పరిశీలించారు. వైద్య సేవలకోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సిబ్బందిని నియమించుకుంటామన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.

News November 6, 2025

‘తొలిప్రేమ’ ఓ ట్రైనింగ్ సెషన్: అధ్యయనం

image

ఫస్ట్ లవ్ కొందరికి మధుర కావ్యం. మరికొందరికి తీరని వ్యథ. ఏదేమైనా దీనికి ముగింపు ఉండదని, ఇది జీవిత పాఠాలను నేర్పించడానికేనని ఓ అధ్యయనంలో తేలింది. మొదటి ప్రేమ గమ్యం కాదని, ఇది కేవలం భావోద్వేగాలు, అంచనాలు & హార్ట్ బ్రేకింగ్ అనుభవాన్ని పరిచయం చేసేదని నిపుణులు పేర్కొన్నారు. దీనిని ‘ట్రైనింగ్ సెషన్’గా వారు అభివర్ణించారు. ఈ అనుభవంతోనే భవిష్యత్తులో వచ్చే సంబంధాలకు సిద్ధమవుతారని అధ్యయనం చెబుతోంది.