News March 20, 2025
గద్వాల బార్ అసోసియేషన్ ఏకగ్రీవ ఎన్నిక

గద్వాల్ బార్ అసోసియేషన్ ఎలక్షన్లు ఏకగ్రీవమయ్యాయి. అధ్యక్షుడిగా శ్యామ్ సుందర్ రావు, ఉపాధ్యక్షుడిగా గుండయ్య, కార్యదర్శిగా షఫీ ఉల్లా, సంయుక్త కార్యదర్శిగా దామోదర్, కోశాధికారిగా విశ్వనాధ్ గౌడ్, గ్రంథాలయం కార్యదర్శిగా మన్యం కొండా, కార్యనిర్వాహక సభ్యులుగా మాధవి లత, వెంకట్ రమణారెడ్డి, శేషిరెడ్డి, మధుసూదన్ బాబును ఎన్నుకున్నారు.
Similar News
News October 22, 2025
సిరిసిల్ల అదనపు కలెక్టర్‌గా గరిమా అగర్వాల్

రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్‌గా గరిమా అగర్వాల్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈమె ప్రస్తుతం సిద్దిపేట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులో ఆమెను నియమించారు.
News October 22, 2025
జగిత్యాల: జర్మనీలో చదువు.. ఉద్యోగ అవకాశాలు

టామ్ కం ఆధ్వర్యంలో జర్మనీలో నర్సింగ్ లో 3 సంవత్సరాల ఇంటర్నేషనల్ డిగ్రీ పొందడానికి తర్వాత నర్సుగా ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవకాశం కల్పిస్తుందని జిల్లా ఉపాధి కల్పనా అధికారి సత్యమ్మ తెలిపారు. ఇంటర్ 60% మార్కులతో ఉత్తీర్ణులై 18-28 వయసుగల వారు అర్హులన్నారు. శిక్షణ సమయంలో లక్ష స్టైఫండ్, అనంతరం 2 నుండి 3 లక్షల ఆకర్షణీయ జీతంతో ఉద్యోగ హామీ లభిస్తుందన్నారు. వివరాలకు 6302292450 నెంబర్లో సంప్రదించాలన్నారు.
News October 22, 2025
‘చింతలపూడిలో మౌలిక వసతులను కల్పించండి’

చింతలపూడి MLA సొంగా రోషన్ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. చింతలపూడి, లింగపాలెం మండలాలను ఏలూరు రెవెన్యూ డివిజన్లో కలపాలని అన్నారు. రహదారుల అభివృద్ధి, ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టాలని కోరారు. తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు గుత్తా వేంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.