News February 1, 2025
గద్వాల: బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టి వెళ్లిపోయారు..!

జోగులాంబ గద్వాల జిల్లాలోని రాయచూర్ రోడ్డు మార్గంలో పార్చర్ల స్టేజీ సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కేటీదొడ్డికి చెందిన బుడ్డ వీరన్న తన ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈయనను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 14, 2025
MHBD: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: రజిత

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఉపాధి అధికారి రజిత అన్నారు. ఈమేరకు సోమవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. మహబూబాబాద్‌లోని శ్రీనివాస నర్సరీ, మారుతీ ఆగ్రోటేక్ ఖాళీగానున్న ఫీల్డ్ అడ్వైజరీ, గ్రూప్ లీడర్స్ పోస్టుల భర్తీకి ఈనెల 15న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు అభ్యర్ధులు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు 18-35 వయసు కలిగిన వారు అర్హులని తెలిపారు.
News October 14, 2025
నిర్మల్ : పోలీస్ సేవలు ప్రజలకు చేరువ చేస్తాం: ఎస్పీ

నిర్మల్ జిల్లాలో పోలీస్ సేవలను మరింత చేరువ చేసి, ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా ఉండి, వినతులను స్వీకరించాలని ఆమె సిబ్బందికి సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.
News October 14, 2025
నిజామాబాద్: సవాలుగా మారిన బంగారం చోరీ కేసు

ఇందల్వాయి మండలం లింగాపూర్‌లో దుర్గాదేవి నవరాత్రుల సమయంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన అపర్ణ పూజా కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చొరబడి 8 తులాల బంగారం, 25 తులాల వెండిని దొంగలు అపహరించారు. సోమవారం బాధితురాలు సీపీ సాయి చైతన్యకు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సందీప్ కేసు నమోదు చేశారు.