News April 16, 2025
గద్వాల: భార్య హత్య కేసులో భర్తకు జైలు

ఎర్రవల్లి మండలంలో ఓ వ్యక్తిని రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాలు.. సాతర్లకి చెందిన షాలు తన భార్య నషియాబాను(32)తో గొడవ పెట్టుకుని మార్చి 30న రోకలిబండతో దాడి చేయటంతో ఆమె కోమాలోకి వెళ్లింది. కర్నూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 4న మృతి చెందింది. ఆమె తల్లి మాసుంబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా మంగళవారం షాలును అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు.
Similar News
News November 21, 2025
కొత్త లేబర్ కోడ్లతో ప్రయోజనాలు..

✧ నేటి నుంచి <<18350734>>అమల్లోకి<<>> వచ్చిన లేబర్ కోడ్లతో 7వ తేదీలోపే వేతనం
✧ పురుషులతో సమానంగా మహిళలకు శాలరీ, రాత్రి పనిచేసే అవకాశం
✧ గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లకు గుర్తింపు.. PF, ESIC, ఇన్సూరెన్స్, OT చేసే కార్మికులకు డబుల్ పేమెంట్
✧ ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు ఏడాది తర్వాత గ్రాట్యుటీ
✧ 40 ఏళ్లు పైబడిన కార్మికులకు ఏటా ఉచిత హెల్త్ చెకప్
✧ ప్రమాదకర రంగాల్లో పనిచేసే వారికి 100% ఆరోగ్య భద్రత
News November 21, 2025
NGKL: రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు: ఎస్పీ

రోడ్లపైన ధాన్యం ఆరబోసే రైతులపై కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ హెచ్చరించారు. రోడ్లపై ధాన్యం వేసి నల్ల కవర్లు కప్పడం వల్ల రాత్రి వేళల్లో రహదారి సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద లేదా బావుల వద్దనే ఆరబోసుకోవాలని సూచించారు. రైతులందరికీ ఈ విషయమై అవగాహన కల్పించాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.
News November 21, 2025
వనపర్తి: ‘ఉల్లంఘించిన రైస్ మిల్లులపై కేసులు’

వనపర్తి జిల్లాలో మొత్తం 173 రైస్ మిల్లులు ఉండగా ఈ ఏడాది 81 మిల్లులకు ధాన్యం కేటాయించేందుకు అనుమతులు ఇచ్చామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మిగిలిన మిల్లులు సకాలంలో ధాన్యం అప్పగించనందున ధాన్యం కేటాయించలేదని, 39 మిల్లులపై కేసులు సైతం నమోదు చేశామన్నారు. ధాన్యం కేటాయించాలంటే ముందుగా కనీసం 10% బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుందని.. ఇప్పటివరకు కేవలం 46 మిల్లులు మాత్రమే గ్యారంటీలు ఇచ్చినట్లు తెలిపారు.


