News March 17, 2025
గద్వాల: మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు: కలెక్టర్

వడదెబ్బకు గురి కాకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సంతోశ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని IDOC భవనంలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు. తలపై గుడ్డలు, టోపీలు, రూమాలు ధరించాలన్నారు.
Similar News
News November 22, 2025
MBNR: పరీక్షలను సజావుగా నిర్వహించాలి.. పీయూ వీసీ ఆదేశం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల్లో 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వీసీ ఆచార్య శ్రీనివాస్ ఎగ్జామినేషన్ ఫ్లైయింగ్ స్క్వాడ్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మాల్ప్రాక్టీస్కు తావు లేకుండా పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని అధికారులకు వీసీ స్పష్టం చేశారు. అనంతరం అధికారులకు ఆర్డర్ కాపీలను అందజేశారు.
News November 22, 2025
HYD: లక్ష్య సాధనకు నిరంతర అధ్యయనం ముఖ్యం: కలెక్టర్

విద్యార్థులు లక్ష్య సాధనకు సిద్ధమై, నిరంతరం అధ్యయనం కొనసాగించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి అన్నారు. నారాయణగూడలోని రాజా బహుదూర్ వెంకటరామి రెడ్డి ఉమెన్స్ కాలేజీలో శనివారం జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ అచ్యుతాదేవి, ప్రొఫెసర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
News November 22, 2025
తూ.గో జిల్లాకు రాష్ట్రంలో ప్రథమ స్థానం

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు గణాంకాలలో తూర్పు గోదావరి జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం గర్వకారణమని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం పేర్కొన్నారు. 75.54 శాతం మార్కులతో జిల్లా ఈ ఘనత సాధించిందన్నారు. సేవల్లో నాణ్యత, ఆరోగ్య ప్రచార కార్యక్రమాల నిర్వహణతో ఆదర్శంగా నిలిచి రాష్ట్రంలో ప్రథమ స్థానం వచ్చినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.


