News April 4, 2025
గద్వాల: మహిళా డిగ్రీ కాలేజీలో మాదక ద్రవ్యాలపై అవగాహన

గద్వాలలోని మహిళా డిగ్రీ కాలేజీలో ఈరోజు ప్రిన్సిపల్ Dr.A.మీనాక్షి అధ్యక్షతన విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. యువతను డ్రగ్స్ ముఠా టార్గెట్ చేసి మాదక ద్రవ్యాలను అలవాటు చేసి, వ్యాపారం చేయిస్తున్నారని, వారితో అప్రమత్తంగా ఉండాలన్నారు. తాత్కాలిక సంతోషాల కోసం బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు.
Similar News
News December 8, 2025
విజయవాడలో ప్రత్యక్షమైన వైసీపీ నేత..!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ మోహన్ ప్రధాన అనుచరుడు విజయవాడ పటమట పోలీసు స్టేషన్లో ప్రత్యక్షమయ్యాడు. ప్రసాదంపాడుకి చెందిన కొమ్మకోట్లు సోమవారం ఉదయం సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో లొంగిపోవడానికి వచ్చాడు. ఈ క్రమంలో వైసీపీ అనుచరులు భారీ సంఖ్యలో పటమట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కొమ్మకోట్లు గత పది నెలలుగా అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే.
News December 8, 2025
వర్షాలు, చలి.. కోళ్ల పెంపకందారులకు సూచనలు

ప్రస్తుతం కొన్నిచోట్ల కురుస్తున్న వర్షాలు, చలి వల్ల కోళ్లకు వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. అందుకే కోళ్ల ఫారాన్ని శుభ్రంగా ఉంచి, నీరు బయటకు పోయేలా డ్రైనేజ్ సక్రమంగా ఉండేట్లు చూడాలి. కోళ్లకు నీరందించే నీటి బుట్టలు లీక్ కాకుండా చూసుకోవాలి. లిట్టర్ బాగా తడిగా ఉంటే దాన్ని వెంటనే తొలగించాలి. ఫారంలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలి. కోళ్లలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెటర్నరీ డాక్టరును సంప్రదించాలి.
News December 8, 2025
గృహ ప్రవేశ సమయంలో గోవు ఎందుకు?

హిందూ సంప్రదాయం ప్రకారం.. ఇంటి నిర్మాణంలో తెలియక చేసిన దోషాలను తొలగించడానికి గోమాతను ఇంట్లోకి తీసుకువస్తారు. గోవు అంటే లక్ష్మీదేవి స్వరూపం. పవిత్రతకు నిలయంగా కూడా భావిస్తారు. గోమూత్రం, గోమయం పవిత్రమైనవి. గోవు ప్రవేశంతో ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే గోవు పాలు, పెరుగు వంటివి వాడటం వలన శరీరానికి, మనసుకు ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం.


