News April 7, 2025

గద్వాల: ‘మాంసం వారానికి ఒకసారే తినండి’

image

ఉమ్మడి <<16019120>>పాలమూరులో<<>> 18 ఏళ్లు పైబడిన వారిలో సగటున 20 శాతం అంటే 87,739 మంది అధిక రక్తపోటు బాధితులే ఉన్నారు. క్యాన్సర్ రోగులు 188 మంది, మధుమేహ వ్యాధిగ్రస్థులు 50,421 మంది ఉన్నారు. మటన్, ఆయిల్‌ఫుడ్, అధిక ఉప్పు, పచ్చడి, తంబాకు, గుట్కా, బ్రెడ్, బేకరీ ఫుడ్ తినొద్దని, స్కిన్‌లెస్ చికెన్, గుడ్డు తెల్ల సొన, ఉడకబెట్టిన కూరగాయలు, పాలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వారానికి ఒకసారి మాత్రమే మాంసం తినాలన్నారు.

Similar News

News October 19, 2025

దీపావళికి ఇంటిని ఇలా డెకరేట్ చేసుకోండి

image

దీపావళి అంటే వెలుగుల పండుగ. ఈ పండుగ రోజున మీ ఇల్లు దేదీప్యమానంగా మెరిసిపోయేందుకు LED లైట్లతో అలంకరించుకోవచ్చు. దీపాలను ఒక వరుసలో పెట్టడం కంటే దియా స్టాండ్లను వాడితే మంచి లుక్ వస్తుంది. గుమ్మానికి పూల తోరణాలతో పాటు హ్యాంగింగ్స్ వేలాడదీయాలి. ఇంటి ఆవరణలో చిన్నమొక్కలు ఉంటే వాటికి లైటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. పూలరంగోళీలు పండుగ శోభను మరింత పెంచుతాయి. పేపర్ లాంతర్లలో లైట్లను వేలాడదీస్తే ఇంకా బావుంటుంది.

News October 19, 2025

రేపు అన్నమయ్య జిల్లా ‘ప్రజా ఫిర్యాదుల వేదిక’ రద్దు

image

అన్నమయ్య జిల్లా రాయచోటి ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరగాల్చిన ‘ప్రజా సమస్యల ఫిర్యాదుల వేదిక’ను రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయ పోలీసులు ‘ప్రజా ఫిర్యాదుల వేదిక’ రద్దు చేసినట్లు చెప్పారు. దీపావళి పండుగ దృష్ట్యా సోమవారం జరగాల్సిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (పబ్లిక్ గ్రీవెన్స్) కార్యక్రమాన్ని రద్దు చేశామని అన్నారు.

News October 19, 2025

పార్శిల్ బుక్ చేసిన వారిపై కఠిన చర్యలు: పార్వతీపురం ఎస్పీ

image

పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బాణసంచా <<18051111>>సామాగ్రి పేలుడు<<>> ఘటనా స్థలాన్ని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పరిశీలించారు. దర్యాప్తు చేసి, బస్సులలో పార్సిల్ సర్వీసు ద్వారా నిషేధిత మందుగుండు సామాగ్రి బుక్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. క్షతగాత్రులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విజయనగరం నుంచి ఫ్యాన్సీ ఐటమ్స్ పేరుతో కొరియర్ వచ్చినట్లు గుర్తించారు.