News March 17, 2025

గద్వాల: మొసలి దాడిలో వ్యక్తి మృతి

image

గద్వాల మండలంలో మొసలి దాడిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన జరిగింది. పోలీసుల వివరాలు.. UPకి చెందిన రబీదాస్(21) గుర్రంగడ్డలో వంతెన పని చేసుకోవడానికి వలస వచ్చాడు. హోలీ పండగ సందర్భంగా స్నేహితులతో మద్యం తాగాడు. స్నేహితులు వెళ్లాక.. అతడు నదీతీర ప్రాంతంలో ఫోన్ మాట్లాడుతుండగా మడుగులో నుంచి మొసలి వచ్చి అతడిని నదిలోకి లాక్కెళ్లింది. ఆదివారం ఉదయం రైతులకు అతడి నదిలో అతడి మృతదేహం కనిపించింది. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News November 24, 2025

సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి: కలెక్టర్

image

కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అములు చేసి జిల్లాకు ప్రధానమంత్రి అవార్డు వచ్చేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం రాత్రి కలెక్టరేట్‌లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హల్‌లో 2026 ప్రధానమంత్రి అవార్డుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.

News November 24, 2025

SRCL: ‘రేపు స్వయం సహాయక సంఘాలకు రూ. 300 కోట్లు’

image

రాష్ట్రంలోని 3,50,000 మహిళా స్వయంసహాయక సంఘాలకు మంగళవారం రూ.300.40 కోట్ల వడ్డీలేని రుణాలను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర డిప్యూటీ CM భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందిరమ్మ చీరెల పంపిణీ పురోగతి, వడ్డీలేని రుణాల పంపిణీ అంశంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సిరిసిల్ల అదనపు కలెక్టర్ కరీమా అగర్వాల్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని డిప్యూటీ CM తెలిపారు.

News November 24, 2025

మొబైల్ యూజర్లకు బిగ్ అలర్ట్

image

మొబైల్ యూజర్లకు టెలికం శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తమ పేరుతో ఉన్న SIM దుర్వినియోగం అయితే వినియోగదారులదే బాధ్యత అని స్పష్టం చేసింది. సిమ్ కార్డులను సైబర్ మోసాలు, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు వాడినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపింది. తమ ఐడెంటిటీతో లింక్ అయిన సిమ్ కార్డులు, డివైస్‌ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. <<18316809>>IMEI<<>> నంబర్లను ట్యాంపర్ చేసిన ఫోన్లను ఉపయోగించవద్దని సూచించింది.