News March 17, 2025
గద్వాల: మొసలి దాడిలో వ్యక్తి మృతి

గద్వాల మండలంలో మొసలి దాడిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన జరిగింది. పోలీసుల వివరాలు.. UPకి చెందిన రబీదాస్(21) గుర్రంగడ్డలో వంతెన పని చేసుకోవడానికి వలస వచ్చాడు. హోలీ పండగ సందర్భంగా స్నేహితులతో మద్యం తాగాడు. స్నేహితులు వెళ్లాక.. అతడు నదీతీర ప్రాంతంలో ఫోన్ మాట్లాడుతుండగా మడుగులో నుంచి మొసలి వచ్చి అతడిని నదిలోకి లాక్కెళ్లింది. ఆదివారం ఉదయం రైతులకు అతడి నదిలో అతడి మృతదేహం కనిపించింది. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News September 17, 2025
ఖమ్మం: సాయుధపోరు.. 900 మంది అమరులయ్యారు

రజాకార్ల అరాచకాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎదురొడ్డి నిలిచింది. సాయుధ, శాంతిపోరులో ఎంతోమంది పాల్గొన్నారు. జమలాపురం కేశవరావు రగిలించిన పోరాట స్ఫూర్తి ఎందరినో ఉద్యమం వైపు నడిపింది. జమలాపురం కేశవరావు, చిర్రావురి లక్ష్మీనర్సయ్య, మిర్యాల నారాయణగుప్తా, పైడిపల్లి హనుమయ్య, గెల్లా కేశవరావు, మంచికంటి రాంకిషన్రావు, లింగం గుప్తా, దాశరథి సోదరులతో పాటు మరెందరో ఉన్నారు. సుమారు 900 జిల్లా వాసులు అమరులయ్యారు.
News September 17, 2025
HYDలో గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు

తెల్లవారుజామునుంచే HYDలోని ప్రముఖ గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తోంది. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకల నేపథ్యంలో ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వరంగల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
News September 17, 2025
హత్య కేసులో దంపతులకు పదేళ్ల జైలు

పెద్దాపురం మండలం జి.రాగంపేటలో జరిగిన హత్య కేసులో భార్యాభర్తలకు పదేళ్ల జైలుశిక్ష పడినట్లు సీఐ విజయశంకర్ తెలిపారు. 2022లో ఆదిన ప్రసాద్, అతని భార్య లక్ష్మి పాలాని కలిసి మంగను ఇంటి మెట్లపై నుంచి తోసేశారు. దీంతో ఆమె మృతి చెందింది. మృతురాలి కూతురు పాపారాణి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ పి. శివశంకర్ కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు వారికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.