News April 12, 2025
గద్వాల: రామకృష్ణ సూసైడ్.. పోలీసుల దర్యాప్తు

మల్దకల్ వాసి రామకృష్ణ(35) శుక్రవారం <<16064365>>సూసైడ్ చేసుకున్న<<>> విషయం తెలిసిందే. గద్వాలకు చెందిన శ్రీవాణి అనే ట్రాన్స్‌జెండర్‌తో తన భర్తకు పరిచయం ఉందని, వారికి మనస్పర్థలు రావడంతో నిత్యం వేధించిందని, అందుకే చనిపోయాడని రామకృష్ణ భార్య ఆరోపించారు. తమ కంటే ముందే రామకృష్ణ మృతదేహాన్ని ముగ్గురు ట్రాన్స్జెండర్లు ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఇది హత్యే అంటూ భార్య ఆరోపించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 18, 2025
ఢిల్లీ పేలుడు: హమాస్ తరహా దాడికి ప్లాన్?

ఢిల్లీ పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కారు బ్లాస్ట్‌కు ముందు టెర్రరిస్టులు భారీ దాడికి కుట్ర చేసినట్లు NIA దర్యాప్తులో వెల్లడైంది. డ్రోన్లను ఆయుధాలుగా మార్చేందుకు, రాకెట్లను తయారు చేసేందుకు యత్నించారని తేలింది. 2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడి తరహాలో అటాక్ చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్టయిన ఉగ్ర అనుమానితుడు డానిష్ ద్వారా ఈ వివరాలు తెలిసినట్లు సమాచారం.

రెండు రోజులు జాగ్రత్త!

TG: రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతాయని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది. ఉదయం 9 గంటలైనా తీవ్రత తగ్గడం లేదు.