News April 12, 2025

గద్వాల: రామకృష్ణ సూసైడ్.. పోలీసుల దర్యాప్తు

image

మల్దకల్ వాసి రామకృష్ణ శుక్రవారం <<16064365>>సూసైడ్ చేసుకున్న<<>> విషయం తెలిసిందే. గద్వాలకు చెందిన శ్రీవాణి అనే ట్రాన్స్‌జెండర్‌తో తన భర్తకు పరిచయం ఉందని,వారికి మనస్పర్థలు రావడంతో నిత్యం వేధించిందని, అందుకే చనిపోయాడని రామకృష్ణ భార్య ఆరోపించారు. తమ కంటే ముందే రామకృష్ణ మృతదేహాన్ని ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఇది హత్యేనని భార్య ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Similar News

News October 21, 2025

ప్రకృతి గీసిన ‘నిడిగొండ’ చిత్రం

image

నీలి మేఘాల కింద కారుమబ్బులు అలుముకొని, అస్తమిస్తున్న సూర్యుడికి వాహనాల వెలుగులు దారి చూపుతున్నట్లు ఎంతో అద్భుతంగా ప్రకృతి గీసిన ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటోంది. రఘునాథ్ పల్లి మండలం నిడిగొండలో సోమవారం సాయంత్రం ఈ చిత్రం ఆవిష్కృతమైంది. స్థానికుడైన వెంకటేష్ తన ఫోన్లో బంధించి Way2Newsతో ఈ చిత్రాన్ని పంచుకున్నాడు.

News October 21, 2025

జనగామ: బెస్ట్ అవైలబుల్ చదువులకు తొలగిన అడ్డంకులు

image

బెస్ట్ అవైలబుల్ పథకం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాలు చేపట్టారు. స్పందించిన ప్రభుత్వం విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయా సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ అధికారులు జిల్లాలోని 5 బెస్ట్ అవైలబుల్ స్కూల్ యాజమాన్యాలతో మాట్లాడి బోధనకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.

News October 21, 2025

ఏపీ, టీజీ న్యూస్ రౌండప్

image

* మిగతా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి: TG సీఎం రేవంత్
* నవంబర్ 7న ఏపీ క్యాబినెట్ భేటీ
* ఖైరతాబాద్, శేరిలింగంపల్లి బస్తీ దవాఖానాలను సందర్శించిన కేటీఆర్, హరీశ్ రావు
* నారా నరకాసుర పాలన పోవాలి.. జగనన్న పాలన రావాలి: రోజా
* హైదరాబాద్‌లో బాణసంచా కాలుస్తూ 70 మందికి గాయాలు