News January 24, 2025

గద్వాల: రూ.63.25 కోట్లతో తాగునీటి పథకం ప్రారంభం

image

గద్వాల మున్సిపల్ పరిధిలో వచ్చే 50 ఏళ్ల వరకు తాగునీటి సమస్య ఉండకుండా అమృత్ 2.0 పథకం కింద చేపట్టే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గద్వాల పట్టణంలో నది అగ్రహారం ఫిల్టర్ బెడ్ వద్ద అమృత్ 2.O పథకం కింద రూ.63.25 కోట్ల వ్యయంతో నీటి సరఫరా అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, ఎంపీ మల్లు ర‌వి, కలెక్టర్ సంతోష్ తో శంకుస్థాపన చేశారు.

Similar News

News February 13, 2025

ప్రసాద్ స్కీం కింద నిధులు ఇవ్వండి: డీకే అరుణ

image

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బుధవారం భేటీ అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అలంపూర్‌ 5వ శక్తి పీఠం జోగులాంబ టెంపుల్‌తో పాటు కురుమూర్తి, మన్యంకొండ, మల్దకల్ తిమ్మప్ప దేవాలయాల అభివృద్ధికి ప్రసాద్ స్కీం కింద నిధులు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ప్రతిపాదనలపై గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారని ఎంపీ పేర్కొన్నారు.

News February 13, 2025

కొవ్వూరులో హీరో రామ్ సినిమా షూటింగ్

image

సినీ హీరో రామ్‌ పోతినేని 22వ సినిమా షూటింగ్‌ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో జరిగింది. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. మంగళవారం ఆరికిరేవుల స్నానఘట్టం, గోదావరి నది వద్ద సన్నివేశాలను చిత్రీకరించారు.  మహేష్‌బాబు.పి దర్శకత్వం వహిస్తుండగా హీరోయిన్‌‌గా భాగ్యశ్రీ ,రావు రమేష్‌, బ్రహ్మానందం, హర్షవర్దన్‌లు నటిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది.

News February 13, 2025

సిద్దిపేట: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

image

జేఈఈ మెయిన్స్ సెషన్ వన్ పరీక్ష ఫలితాల్లో హుస్నాబాద్ మండలంలోని జిల్లా గడ్డ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ రాజు తెలిపారు. సునీల్ 81.8%, సిద్ధార్థ 77.33%,  మోక్షజ్ఞ 77.04%, విష్ణు 74.81%, అజయ్ 73.56%, ప్రేమ్ చరణ్ 71.96%, 16 మంది విద్యార్థులకు పైగా 60% మార్కులు సాధించారని తెలిపారు.

error: Content is protected !!