News January 29, 2025

గద్వాల: రేపు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహనాలకు వేలం

image

గద్వాల:పోలీస్ తనిఖీలో పట్టుబడి ఎవరూ క్లెయిమ్ చేసుకోని (స్క్రాబ్) 73 వాహనాలకు గురువారం ఉదయం 9:00 గంటలకు బహిరంగవేలం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల బిడ్డర్స్ ఈరోజు సాయంత్రం వరకు ఎంట్రీ ఫీజు రూ. 200/- చెల్లించాలన్నారు. ఆధార్ కార్డ్ జిరాక్స్ కాఫీతో వేలంలో పాల్గొనాలన్నారు.

Similar News

News March 14, 2025

మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ హోలీ శుభాకాంక్షలు

image

హోలీ పండుగను పురస్కరించుకుని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాగ ద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోలీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషం వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోలీని జరుపుకోవాలని అభిలషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు.

News March 14, 2025

SPMVV : ఫలితాలు విడుదల

image

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏడాది జనవరిలో (M.B.A) మీడియా మేనేజ్మెంట్ మొదటి సెమిస్టర్, ఫిబ్రవరి నెలలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు మహిళ యూనివర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News March 14, 2025

MLG: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

image

ములుగుల్లో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI

error: Content is protected !!