News February 16, 2025

గద్వాల: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

గద్వాల పట్టణంలోని మొదటి రైల్వే గేటు వద్ద గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. రైల్వే ఫ్లై ఓవర్ కింద ప్రమాదం జరగడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందన్నారు. వ్యక్తిని గుర్తించిన వారు గద్వాల రైల్వే పోలీస్ సెల్ 8341252529 నంబర్‌కు కాల్ చేయాలన్నారు.

Similar News

News March 24, 2025

యాదాద్రి: రూ.20 లక్షల స్కాలర్ షిప్

image

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి ఇన్‌ఛార్జి అధికారి వసంత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్ అందుతుందన్నారు.

News March 24, 2025

భూపాలపల్లి: వీణవంకలో 16టన్నుల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

image

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నుంచి కరీంనగర్ జిల్లా మీదుగా అక్రమంగా తరలిస్తున్న 16టన్నుల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున వీణవంక వద్ద పట్టుకున్నారు. లారీని అనుమానంతో ఆపి తనిఖీ చేయగా, రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేసిన పోలీసులు, దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

News March 24, 2025

రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన ADB అమ్మాయి

image

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఆదిలాబాద్ అమ్మాయి సత్తాచాటింది. HYDలో ఆదివారం నిర్వహించిన పోటీల్లో ఆదిలాబాద్‌కు చెందిన క్రీడాకారిణి జాదవ్ కుషవర్తి అండర్ 20 విభాగంలో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా జాదవ్ కుషవర్తితోపాటు కోచ్ సౌమ్య, మేనేజర్ అనిల్‌ను జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేష్‌, పలువురు అభినందించారు

error: Content is protected !!