News March 15, 2025

గద్వాల: రోడ్డు ప్రమాదంలో యువకుడి మ‌ృతి

image

అంతర్ రాష్ట్ర రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. మానవపాడు మం. చెన్నిపాడుకి చెందిన రవీంద్రనాథ్ రెడ్డి (34) తన తల్లి సుబ్బమ్మతో కలిసి కలుగొట్ల గ్రామంలో నివాసం ఉంటున్నారు. వ్యక్తిగత పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో అలంపూరు చౌరస్తా నుంచి శాంతినగర్ వెళ్లేదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు.

Similar News

News November 20, 2025

నటి మృతి.. అసలేం జరిగింది?

image

నటి ప్రత్యూష మృతి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తాను నిర్దోషినని ఆమె ప్రియుడు సిద్ధార్థరెడ్డి.. నిందితుడికి శిక్ష పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజిని వేసిన పిటిషన్లపై తీర్పును SC రిజర్వ్ చేసింది. ఇంటర్‌లో ప్రేమించుకున్న ప్రత్యూష, సిద్ధార్థ్ 2002 FEB 23న విషం తాగారు. మరుసటి రోజు ప్రత్యూష మరణించగా సిద్ధార్థ్ కోలుకున్నాడు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేలా అతడే ఉసిగొల్పాడంటూ ప్రత్యూష తల్లి కోర్టుకెళ్లారు.

News November 20, 2025

సంతానలేమికి ముందే హెచ్చరికలు

image

సంతానలేమితో బాధపడే మహిళల్లో రజస్వల నాటి నుంచే కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తుంటాయంటున్నారు నిపుణులు. నెలసరి సక్రమంగా రాకపోవడం, ఎక్కువరోజులు బ్లీడింగ్ కావడం, కొందరు 18 ఏళ్లు వచ్చినా అసలు రజస్వలే కాకపోవడం వంటివి గమనించాలి. ఊబకాయం, అవాంఛిత రోమాలు మొలవటం, విడవకుండా మొటిమలు వేధించటం, తీవ్రమైన కడుపునొప్పి వంటివీ ఉండొచ్చు. వీటిని రక్త పరీక్షలు, స్కానింగ్‌తో గుర్తించొచ్చు.

News November 20, 2025

కృష్ణా: పంచాయితీలలో నిధుల గోల్‌మాల్.. రికవరీ ఆదేశాలు.!

image

ఉంగుటూరు MPDO 2019-21 వరకు నిధులను దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది. జ్యోతి హయంలో రూ.58.56లక్షల నిధులు పక్కదారిలో వినియోగించబడినట్లు గుర్తించబడింది. పెద్దఅవుటపల్లి రూ.43.84లక్షలు, పొట్టిపాడు రూ.13.35లక్షలు, Nఅప్పారావుపేట రూ.1.37లక్షలు దారి మళ్లాయి. కార్యదర్శులు వెంకటేశ్వర్లు, అమీర్ బాషకు సంబంధించిన రూ.29.28లక్షలు MPDO ద్వారా దుర్వినియోగం అయిందని తేలడంతో కలెక్టర్ రికవరీ చర్యలకు ఆదేశించారు.