News March 31, 2025
గద్వాల: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన ఎర్రవల్లి సమీపంలో జరిగింది. పోలీసుల వివరాలు.. గద్వాల మం. గుంటిపల్లికి చెందిన రాజన్న(60) శనివారం రాత్రి బైక్పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజన్న అక్కడికక్కడే మృతిచెందారు. ఈ మేరకు కేసునమోదైంది.
Similar News
News January 7, 2026
VZM: సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం అమలుపై జేసీ సమీక్ష

విజయనగరం జిల్లాలో అమలవుతున్న సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం పనితీరుపై జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ బుధవారం ఐసీడీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం నాణ్యతతో, సరైన మోతాదులో సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాల సరఫరాలో లోపాలు లేకుండా తక్షణమే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
News January 7, 2026
ములుగు: గుండెలు పిండేసే ఘటన

వెంకటాపూర్(M) ఇంచెంచెరువుపల్లిలో గుండెలుపిండేసే ఘటన చోటుచేసుకుంది. హర్కవత్ లక్ష్మి-లచ్చిరాం దంపతులకు యాకుబ్(30) ఒక్కడే కుమారుడు. కొన్నేళ్లక్రితం లచ్చిరాం మరణించాడు. కిడ్నీ వ్యాధితో నిన్న రాత్రి యాకుబ్ కన్నుమూశాడు. దీంతో తల్లి లక్ష్మి ఒంటరైంది. బాధను దిగమింగుతూ కొడుకు చితికి నిప్పు పెట్టింది. ఈ సంఘటన చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. నిరుపేద అయిన లక్ష్మిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
News January 7, 2026
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మరోసారి వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం వచ్చే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలను తగ్గించుకోవాలని అధికారులు సూచించారు.


