News April 6, 2025
గద్వాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న గద్వాలలో జరిగింది. స్థానికుల వివరాలు.. కర్ణాటకలోని యరగెరకు చెందిన శ్రీనివాసులు(55) గద్వాలలో శుభకార్యానికి హజరై సాయంత్రం ఆరగిద్దలోని తన కూతురు దగ్గరికి బైక్పై బయలుదేరాడు. గొర్లఖాన్దొడ్డి-ఆరగిద్దల మధ్య నిర్మాణంలో ఉన్న రోడ్డుపై అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలవటంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యంలో చనిపోయాడు.
Similar News
News November 26, 2025
పెరుగు, చక్కెర కలిపి ఎందుకు తింటారు?

శుభకార్యాలు ప్రారంభించే ముందు పెరుగు, చక్కెర కలిపి తింటారు. ఇలా తింటే అదృష్టం వరిస్తుందన్న నమ్ముతారు. అయితే దీని వెనుక ఓ ఆరోగ్య రహస్యం ఉంది. ఇంటర్వ్యూ, పెళ్లి చూపులు, ఫస్ట్ డే ఆఫీస్కు వెళ్లినప్పుడు ఎవరికైనా ఒత్తిడి, ఆందోళన ఉంటుంది. అయితే పెరుగుకు దేహాన్ని చల్లబరచే సామర్థ్యం, చక్కెరకు తక్షణ శక్తి అందించే లక్షణాలు ఉంటాయి. ఈ మిశ్రమం తీసుకుంటే టెన్షన్ తగ్గి, మనసు శాంతిస్తుంది. అందుకే తినమంటారు.
News November 26, 2025
ఏపీ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలకు అప్లై చేశారా?

ఏపీ గ్రామీణ బ్యాంకులో 7 ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. వయసు 35 నుంచి 63ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.23,500, సీనియర్ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్కు రూ.30వేల చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://apgb.bank.in/
News November 26, 2025
‘ఉద్యాన రైతుల ఆదాయం పెరగాలి.. కార్యాచరణ రూపొందించండి’

AP: రాయలసీమలోని 5.98 లక్షల మంది ఉద్యాన రైతుల ఆదాయం పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ఈ కార్యాచరణ ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం పూర్వోదయ కింద రాయలసీమలో పండ్ల తోటల పెంపకం, సాగు సబ్సిడీ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అంశాలపై మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు.


