News March 11, 2025
గద్వాల: లేఅవుట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్

ప్రభుత్వ నిబంధనల మేరకు లేఅవుట్ల అభివృద్ధి జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గద్వాల్ మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్లు 898, 900, 93 ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ లేఅవుట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లే అవుట్ల అభివృద్ధిలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు.
Similar News
News November 16, 2025
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: MLA బుయ్యని

బషీరాబాద్ మండలం కాశీంపూర్, ధామర్చేడ్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే ధాన్యం తరలించాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, బస్తాల సరఫరా, రవాణా ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా అని ఆయన స్వయంగా పరిశీలించారు.
News November 16, 2025
NRPT: గొలుసుకట్టు వ్యాపారాల జోలికి వెళ్లొద్దు: ఎస్పీ

తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుందని మోసగాళ్లు చెప్పే గొలుసుకట్టు (Multi-Level Marketing) వ్యాపారాల జోలికి ప్రజలు వెళ్లవద్దని ఎస్పీ డాక్టర్ వినీత్ హెచ్చరించారు. ఈ వ్యాపారాల వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారని, ప్రజలు మాయ మాటలు నమ్మి మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను కూడా నమ్మకూడదని తెలిపారు.
News November 16, 2025
SRD: కవితకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హెచ్చరిక

సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుపై మెదక్లో MLC కవిత చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్యరావు అన్నారు. సంగారెడ్డి MLA క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కవిత చేసిన వ్యాఖ్యలు ఏ పార్టీకి ఉపయోగపడతాయని ప్రశ్నించారు. మరోసారి హరీశ్ రావుపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


