News March 11, 2025
గద్వాల: లేఅవుట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్

ప్రభుత్వ నిబంధనల మేరకు లేఅవుట్ల అభివృద్ధి జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గద్వాల్ మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్లు 898, 900, 93 ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ లేఅవుట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లే అవుట్ల అభివృద్ధిలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు.
Similar News
News February 12, 2026
లిక్కర్ స్కామ్‌కు రాజ్ కసిరెడ్డే ఆర్కిటెక్ట్: సుప్రీంకోర్టు

AP: మద్యం కుంభకోణానికి రాజ్ కసిరెడ్డే ఆర్కిటెక్ట్ అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారించేందుకు నిరాకరించింది. దీంతో పిటిషన్ వెనక్కి తీసుకుంటామని రాజ్ తరఫు న్యాయవాది చెప్పగా ధర్మాసనం అనుమతించింది. ఏపీ లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
News February 12, 2026
విదేశీ విద్యపై మోజు తగ్గుతోంది..

భారతీయ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యపై మోజు తగ్గుతోంది. అబ్రాడ్‌కు వెళ్లే వారి సంఖ్య రెండేళ్లలో 31% తగ్గడమే ఇందుకు నిదర్శనం. 2023లో ఫారిన్‌కు 9.8L మంది వెళ్లారు. ఆ సంఖ్య 2024లో 7.7L ఉండగా 2025 నాటికి 6.26Lకు పడిపోయింది. ‘విదేశీ చదువు వారి వ్యక్తిగతం. ఆర్థిక స్తోమత, బ్యాంకు లోన్లు పొందడం, పలు దేశాలను చూడాలనుకోవడం.. ఇలా పలు అంశాలు ప్రభావితం చేస్తాయి’ అని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
News February 12, 2026
నిర్మల్: పల్లెలో పౌరుషం.. పట్నంలో ఏది..?

ఎన్నికలంటే ఉండే ఆ జోష్, పౌరుషం పట్నంలో కనిపించలేదు. మున్సిపల్ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతమే ఇందుకు నిదర్శనం. గ్రామీణ ప్రాంతమైన ఖానాపూర్ మున్సిపాలిటీలో 74.83% ఫర్వాలేదనిపించినా, విద్యావంతులు ఎక్కువగా ఉండే నిర్మల్‌లో 65.47%, భైంసాలో 62.67% తక్కువ నమోదు కావడం ఆందోళనకరం. సెలవు దినాన్ని ఎంజాయ్ చేయడానికే పరిమతమయ్యారు తప్ప, ఓటు హక్కు వినియోగించుకోవడంలో పట్టణ ఓటరు బద్ధకం వీడలేదు.


