News March 20, 2025
గద్వాల: లేఅవుట్లను పరిశీలించిన కలెక్టర్

లేఅవుట్ల అభివృద్ధి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా కార్యాచరణ రూపొందించి, సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం అయిజ మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్లు 751, 957 ప్రాంతాల్లో లేఅవుట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నీటి వనరుల అభివృద్ధి, అప్రోచ్ రోడ్డు ఏర్పాటు, విద్యుత్ సరఫరా డ్రైనేజ్ కనెక్షన్లను సమగ్రంగా అందుబాటులోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 21, 2025
వాజేడు ఫారెస్ట్ రేంజర్ చంద్రమౌళి బదిలీ

వాజేడు ఫారెస్ట్ రేంజర్ చంద్రమౌళి బదిలీ అయ్యారు. ఐదేళ్లుగా విధులు నిర్వహించిన చంద్రమౌళిని అటవీ శాఖ ఉన్నతాధికారులు బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు భూపాలపల్లి జిల్లాలోని చెల్పూరు రేంజికి ఆయన్ను బదిలీ చేయగా విధుల్లో చేరారు. ఆయన స్థానంలో ప్రస్తుతం వెంకటాపురం(కే) రేంజర్ వంశీకృష్ణకు వాజేడు రేంజర్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు.
News November 21, 2025
ప.గో: గుండెపోటు.. నడుస్తున్న రైలులోనే ప్రాణం పోయింది!

రాజమండ్రికి చెందిన 67 ఏళ్ల వనమా లక్ష్మి నడుస్తున్న రైలులో గుండెపోటుకు గురై మృతి చెందింది. తన కుమార్తె గృహప్రవేశం నిమిత్తం విజయవాడకు బయలుదేరిన ఆమెకు దారి మధ్యలో గుండెపోటు రావడంతో ఏలూరు రైల్వే స్టేషన్లో దించి వైద్యం అందించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై ఏలూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 21, 2025
విద్యార్థులకు ఉపశమనం.. రూ.161 కోట్ల బకాయిలు విడుదల

ఖమ్మం: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించిన రూ.161 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజాభవన్లో జరిగిన సమీక్షలో ఈ మేరకు సూచించారు. ఈ నిర్ణయంతో వేలాది మంది పేద విద్యార్థులకు, కళాశాలలకు ఆర్థికంగా ఊరట లభించనుంది.


