News April 5, 2025

గద్వాల: ‘వక్ఫ్ సవరణ బిల్లుతో ఆర్థిక ప్రయోజనాలు’

image

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎ.పాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం చారిత్రాత్మకమని అన్నారు. బిల్లును క్రమబద్ధీకరించడంతో భవిష్యత్తులో ముస్లిం సమాజానికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని అన్నారు. సమావేశంలో రవికుమార్ ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News November 24, 2025

GNT: నేడు వంగర వెంకట సుబ్బయ్య జయంతి

image

తెలుగు సినిమా, నాటక రంగాలలో ప్రసిద్ధి చెందిన హాస్యనటుడు వంగర వెంకట సుబ్బయ్య జయంతి నేడు. ఆయన 1897, నవంబర్ 24న సంగం జాగర్లమూడిలో జన్మించారు. రంగస్థల ప్రస్థానంలో తెనాలిలో స్థిరపడి, ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకంలో వసంతకుడి వేషంతో కళాహృదయుల మన్ననలు అందుకున్నారు. ఆయన దాదాపు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించారు. ‘పెద్దమనుషులు’, ‘కన్యాశుల్కం’, ‘మాయాబజార్’ వంటి చిత్రాలలో తన హాస్యంతో ప్రేక్షకులను అలరించారు.

News November 24, 2025

తమిళనాడుకు భారీ వర్ష సూచన.. విద్యాసంస్థలకు సెలవులు

image

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించడంతో 18 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవులు ప్రకటించారు. ఒకేసారి 2 సైక్లోనిక్ తుఫానులు రావడంతో తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే తెంకాసి, తిరునల్వేలి, తూత్తుకుడి సహా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.

News November 24, 2025

కొహీర్: జీపీవో రాష్ట్ర కార్యదర్శిగా మల్లీశ్వరి

image

కొహీర్ మండల కేంద్రంలో జీపీవోగా పనిచేస్తున్న నీరుడి మల్లీశ్వరి రాష్ట్ర స్థాయి కీలక పదవికి ఎంపికయ్యారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జీపీవో రాష్ట్ర సదస్సులో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ వి. లచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర జీపీవో నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంగారెడ్డి జిల్లా నుంచి మల్లీశ్వరి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.