News April 8, 2025
గద్వాల: ‘వారు దరఖాస్తు చేసుకోండి’

గద్వాల జిల్లాలోని క్రిస్టియన్ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి గుర్తింపు పొందిన శిక్షణ భాగస్వామ్య సంస్థల నుంచి దరఖాస్తుల స్వీకరణ తేదీని ఈనెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ అధికారి యం.పి. రమేష్ బాబు ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఆపై తరగతులు చదివిన క్రిస్టియన్ నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చుటకు NSDC, TASK, EGMM, MEPMA, NI-MSME ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
Similar News
News November 17, 2025
సమస్యలుంటే నేరుగా ఫిర్యాదు చేయండి: సంగారెడ్డి ఎస్పీ

ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలు నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ ఎస్.ఐ.లను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.

డిజిటల్ అరెస్టు అంటూ ₹32 CRకు టోపీ

సైబర్ ఫ్రాడ్‌కు చిక్కి బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఏకంగా ₹32 CR మేర పోగొట్టుకుంది. పాస్‌పోర్టులు, క్రెడిట్ కార్డులు, డ్రగ్స్‌తో కొరియర్ వచ్చిందని, ఇది క్రైమ్ అని ఆమెకు ముందు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆపై నేరగాళ్లు డిజిటల్ అరెస్టు అని నెల రోజులు స్కైప్, కాల్స్‌తో నిఘా పెట్టారు. RBI FIU పేరిట ఆస్తులు ఇతర చిట్టా అడిగారు. వాటి క్లియరెన్స్ పేరిట ₹32 కోట్లు తీసుకున్నారు. మోసంపై ఆమె ఆలస్యంగా ఫిర్యాదు చేశారు.